Ashes 2021 No Ball: యాషెస్ సిరీస్ మొదలైందంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య వైరం.. మాటల యుద్ధం కనిపించడం సహజం. అయితే తొలి టెస్టులో మాత్రం నోబాల్స్ వ్యవహారం ఎక్కువ చర్చనీయాంశమైంది. గబ్బా వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ పదే పదే నోబాల్స్ వేయడం.. మైదానంలోని అంపైర్ వాటిని గుర్తించకపోవడం వివాదాస్పదమవుతోంది.
Ashes 2021 No Ball: యాషెస్‌లో 'నోబాల్స్' కలకలం - యాషెస్ 2021 బెన్ స్టోక్స్ నోబాల్స్
Ashes 2021 No Ball: ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో నోబాల్స్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. గబ్బా వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ పదే పదే నోబాల్స్ వేయడం.. మైదానంలోని అంపైర్ వాటిని గుర్తించకపోవడం వివాదాస్పదమవుతోంది.
Ben Stokes Ashes: సుదీర్ఘ విరామం తర్వాత యాషెస్‌లో పునరాగమనం చేసిన స్టోక్స్.. తన తొలి ఓవర్లోనే నాలుగో బంతికి డేవిడ్ వార్నర్ (17)ను బౌల్డ్ చేశాడు. అయితే రిప్లేలో బంతి నోబాల్‌గా తేలడం వల్ల వార్నర్ బతికిపోయాడు. కాని అసలు విషయం అప్పుడే వెలుగులోకి వచ్చింది. స్టోక్స్ అంతకుముందు వేసిన మూడు బంతులు కూడా నోబాల్సే. మూడో అంపైర్ పాల్ విల్సన్ కూడా ఈ విషయాన్ని గుర్తించలేదు. తొలి సెషన్‌లో 5 ఓవర్లు వేసిన స్టోక్స్ ఏకంగా 14 మార్లు గీత దాటగా.. కేవలం రెండు సార్లు మాత్రమే అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు.
మ్యాచ్ అధికారుల పనితీరుపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం వల్ల క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించింది. సాంకేతిక సమస్యల కారణంగా మూడో అంపైర్ ప్రతి బంతిని పరిశీలించలేకపోయారని తెలిపింది. అందుకే నోబాల్స్‌ను మైదానంలోని అంపైర్ నిర్ణయానికే వదిలేశాడని పేర్కొంది. అయితే వికెట్ పడిన బంతుల్ని మూడో అంపైర్ రిప్లేలో చూసుకుని నిర్ధారించుకునే అవకాశముండటం వల్ల వార్నర్ బతికిపోయాడు. ఇక పేలవమైన అంపైరింగ్‌పై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ విమర్శలు గుప్పించాడు.