ASHES 2021: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య యాషెస్ సిరీస్‌కు వేళైంది. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. కీలక బౌలర్ జిమ్మీ అండర్సన్, స్టార్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో లేకుండానే బరిలో దిగుతోంది ఇంగ్లీష్ జట్టు. కాగా ఆస్ట్రేలియా మాత్రం బలంగా కనిపిస్తోంది. మొదటిసారి పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన కమిన్స్ జట్టును ఏ విధంగా నడిపిస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆస్ట్రేలియా జట్టు:మార్కస్ హారిస్, డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రెవిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారే(వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, లియోన్, జోష్ హేజిల్‌వుడ్.
ఇంగ్లాండ్ జట్టు:జో రూట్(కెప్టెన్), స్టువర్ట్ బ్రాడ్, రోరీ బర్న్స్, జాస్ బట్లర్, హసీద్ హమీద్, జాక్ లీచ్, డేవిడ్ మలన్, ఒల్లీ పోప్, ఒల్లీ రాబిన్సన్, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్
ASHES 2021: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్
ASHES 2021: యాషెస్ టెస్టు సిరీస్ బుధవారం(డిసెంబర్ 8) ప్రారంభమైంది. తొలి టెస్టులో భాగంగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది.
యాషెస్ సిరీస్
Last Updated : Dec 8, 2021, 6:13 AM IST