Ashes 3rd Test: యాషెస్ సిరీస్‌లో ఇప్పటికే తొలి రెండు టెస్టులు గెలిచి జోరుమీదుంది ఆస్ట్రేలియా. వరుసగా రెండు ఓటములతో నిరాశలో కూరుకుపోయింది ఇంగ్లాండ్. ఇక ఈ రెండు జట్లు ముచ్చటగా మూడో పోరులో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. మెల్బోర్న్ వేదికగా ఆదివారం ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్లు వారి తుదిజట్లను ప్రకటించాయి.
నాలుగు మార్పులతో ఇంగ్లాండ్
తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమితో ఒత్తిడిలో పడిపోయింది ఇంగ్లాండ్ జట్టు. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలన్న కసితో ఉంది. ఈ క్రమంలోనే జట్టులో కీలక మార్పులు చేసింది. ఫామ్‌లేమితో సతమతమవుతున్న ఓపెనర్ రోరీ బర్న్స్‌తో పాటు ఒల్లీ పోప్‌కు మొండిచేయి చూపింది. దీంతో స్టార్ ఓపెనర్ బెయిర్ స్టోతో జట్టులోకి వచ్చాడు. అలాగే స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌ను తుదిజట్టులోకి తీసుకోలేదు.
ఇంగ్లాండ్ జట్టు