Ashes 2021: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో బోణీ కొట్టింది ఆస్ట్రేలియా. ఇంగ్లాండ్‌తో బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లీష్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుని తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ కెప్టెన్ కమిన్స్ 5 వికెట్లతో ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన కంగారూ జట్టు 425 పరుగుల భారీ స్కోర్ సాధించింది. హెడ్ (152) భారీ శతకంతో పాటు వార్నర్ 94 పరుగులతో సత్తాచాటారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు 278 పరుగలు ఆధిక్యం సంపాదించింది.
Ashes 2021: తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ను చిత్తుచేసిన ఆస్ట్రేలియా - యాషెస్ 2021 తొలి టెస్టు
Ashes 2021: ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్ తొలి టెస్టులో ఘనవిజయం సాధించింది ఆస్ట్రేలియా. 9 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదించింది.
![Ashes 2021: తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ను చిత్తుచేసిన ఆస్ట్రేలియా Ashes 2021 latest news, Australia beat England, ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా విజయం, యాషెస్ 2021 న్యూస్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13875404-1005-13875404-1639193995760.jpg)
Ashes 2021 Score Card: అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు దీటుగా బదులిస్తున్నట్లు కనిపించింది ఇంగ్లీష్ జట్టు. మూడో రోజు కేవలం రెండే వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. రూట్, మలన్ అద్వితీయంగా కనిపించారు. అయితే నాలుగో రోజు ఆట ప్రారంభంలోనే మలన్(82)ను పెవిలియన్ పంపాడు లియోన్. కాసేపటికే రూట్ (89) ఔటయ్యాడు. అనంతరం పోప్ (4), స్టోక్స్ (14), బట్లర్ (23) జట్టును ఆదుకోవడంలో విఫలమయ్యారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 297 పరుగులకు పరిమితమైంది రూట్‌సేన. ఆస్ట్రేలియా ముందు 20 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 1 వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచింది.