తెలంగాణ

telangana

ETV Bharat / sports

Ashes 2021: చివరి మూడు టెస్టులకు ఆస్ట్రేలియా జట్టిదే

Australia Squad for Ashes: యాషెస్ సిరీస్​లో భాగంగా మిగిలిన మూడు టెస్టులకు జట్టును ప్రకటించింది ఆస్ట్రేలియా. రెండో టెస్టుకు దూరమైన కెప్టెన్ కమిన్స్, హేజిల్​వుడ్​ తిరిగి జట్టులోకి వచ్చారు.

Australia squad, Australia ashes 2021, ఆస్ట్రేలియా జట్టు,ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్
Australia

By

Published : Dec 20, 2021, 12:19 PM IST

Australia Squad for Ashes: యాషెస్ సిరీస్​లో మిగిలిన మూడు టెస్టుల కోసం జట్టును ప్రకటించింది ఆస్ట్రేలియా. గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన పేసర్ హేజిల్​వుడ్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్​ తిరిగి జట్టులోకి వచ్చారు. మిగతా జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. మార్కస్ హారిస్​కు ఓపెనర్​గా మరో అవకాశం ఇచ్చారు. దీంతో ఉస్మాన్ ఖవాజా బ్యాకప్ ఓపెనర్​గానే ఉండనున్నాడు. మిగిలిన మూడు టెస్టులు మెల్​బోర్న్, సిడ్నీ, హోబర్ట్ వేదికలుగా జరగనున్నాయి.

ఆస్ట్రేలియా జట్టు

ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ కారే, కామెరూన్ గ్రీన్, హేజిల్​వుడ్, మార్కస్ హారిస్, ట్రెవిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, లబుషేన్, లియోన్, మైఖేల్ నెసర్, జే రిచర్డ్​సన్, స్టార్క్, మిచెల్ స్వెప్సన్, వార్నర్.

ఓటమి దిశగా ఇంగ్లాండ్

రెండో టెస్టును డ్రా చేసుకోవడం కోసం ఇంగ్లాండ్ పోరాడుతోంది. ఐదు రోజు డిన్నర్ బ్రేక్ సమయానికి 6 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. బట్లర్ (16*), వోక్స్ (28*) క్రీజులో ఉన్నారు. ఇంకా 326 పరుగులు వెనుకంజలో ఉంది ఇంగ్లీష్ జట్టు.

ఇవీ చూడండి: Peng Shuai U-Turn: నాపై లైంగిక దాడి జరగలేదు.. పెంగ్ యూటర్న్

ABOUT THE AUTHOR

...view details