Ashes 2021 4th Test: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య విజయం దోబూచులాడుతోంది. ఇంగ్లాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 294 పరుగులకే ఆలౌట్ చేసిన ఆసీస్.. రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 265 రన్స్ చేసి డిక్లేర్ చేసింది. దీంతో ఇంగ్లీష్ జట్టు ముందు 388 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. ఇంకా 358 పరుగుల వెనకపడి ఉంది. జాక్ క్రాలే (22), హసీబ్ హమీద్ (8) క్రీజులో ఉన్నారు. చివరిరోజు ఆస్ట్రేలియా దుర్భేద్య బౌలింగ్‌ను తట్టుకుని ఇంగ్లీష్ బ్యాటర్లు పోరాడితే రూట్‌సేన విజయం సాధించవచ్చు. లేదా డ్రా కోసమైనా పోరాడవచ్చు.
ఖవాజా మరో సెంచరీ.. చివరి రోజు ఇంగ్లాండ్‌కు సవాలే! - ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ నాలుగో టెస్టు లేటెస్ట్ న్యూస్
Ashes 2021 4th Test: ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీతో మెరిశాడు. దీంతో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్ ముందు 388 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కాగా, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది ఇంగ్లాండ్.
అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 416 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఈ సిరీస్‌లో తొలి టెస్టు ఆడుతున్న ఖవాజా (137) అద్భుత సెంచరీతో కదం తొక్కగా.. స్మిత్ (67) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం ఇంగ్లాండ్‌ను 294 పరుగులకే ఆలౌట్ చేసింది కంగారూ జట్టు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో బెయిర్‌స్టో (113) సెంచరీతో మెరవగా.. స్కోక్స్ (66) హాఫ్ సెంచరీ చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ ఖవాజా సెంచరీతో సత్తాచాటడం వల్ల 68.5 ఓవర్లలోనే 6 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసి డిక్లేర్ చేసింది ఆసీస్.