Ashes 2021-22: యాషెస్ సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లాండ్‌పై జరిమానా పడింది. అసభ్య పదజాలం ఉపయోగించిన కారణంగా ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్‌పై కూడా మ్యాచ్ ఫీజులో కోత విధించారు అధికారులు.
ఐదు పాయింట్లు కోల్పోయి..
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఐదు ఓవర్లు స్లోగా వేసింది. దీంతో మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ ఇంగ్లాండ్ జట్టు మ్యాచ్ ఫీజుపై 100 శాతం కోత విధించాడు. ఐసీసీ నియమావళి ఉల్లంఘన నేపథ్యంలో ఆర్టికల్ 2.22 ప్రకారం.. ఆటగాళ్లపై ప్రతి స్లో ఓవర్‌కు 20 శాతం కోత విధిస్తున్నట్లు పేర్కొన్నాడు బూన్. అయితే.. ఈ కారణంగానే ఇంగ్లాండ్ వరల్డ్ టెస్టు ఛాంపియన్స్‌లో ఐదు పాయింట్లు కోల్పోయింది.
మరోవైపు తొలి టెస్టులో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచిన ట్రావిస్ హెడ్.. ఆసీస్ ఇన్నింగ్స్ 77వ ఓవర్లో అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడు. ఐసీసీ నియమాల ఉల్లంఘన నేపథ్యంలో ఆర్టికల్ 2.3 ప్రకారం అతడికి మ్యాచ్ ఫీజుపై 15 శాతం కోత విధించి, ఓ డీమెరిట్ పాయింట్ ఇచ్చారు మ్యాచ్ రిఫరీ.