తెలంగాణ

telangana

ETV Bharat / sports

అలా ఔటయ్యావేంటి బట్లర్.. చూస్కొని ఆడాలిగా! - బట్లర్ ఆస్ట్రేలియా యాషస్

Buttler Hit Wicket: యాషెస్ సిరీస్​లో భాగంగా ఇంగ్లాండ్​తో జరిగిన రెండో టెస్టులో ఘనవిజయం సాధించింది ఆస్ట్రేలియా. అయితే ఈ మ్యాచ్​ రెండో ఇన్నింగ్స్​లో ఎంతో పోరాటపటిమ కనబర్చిన ఇంగ్లీష్ వికెట్ కీపర్ బట్లర్ ఔటైన తీరు అభిమానుల్ని నిరాశకు గురిచేసింది.

Buttler Hit Wicket, Buttler latest news, బట్లర్ హిట్ వికెట్, బట్లర్ యాషెస్
jos buttler

By

Published : Dec 20, 2021, 4:35 PM IST

Buttler Hit Wicket: యాషెస్ సిరీస్​లో భాగంగా ఇంగ్లాండ్​తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్​ను డ్రా చేసుకునేందుకు ఇంగ్లీష్ జట్టు పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ జట్టు స్టార్ బ్యాటర్ బట్లర్ కూడా చాలా గొప్పగా పోరాడాడు. 207 బంతులాడి 26 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఎంతో పట్టుదల చూపించాడు. ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఇతడు ఇంగ్లీష్ జట్టును డ్రాతో గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. కానీ అనూహ్య రీతిలో ఔటై జట్టుకు నిరాశ మిగిల్చాడు.

ఏం జరిగింది?

అప్పటికీ 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసి ఓటమికి దగ్గరైంది ఇంగ్లాండ్. ఓవైపు వికెట్లు పడుతున్నా బట్లర్ మాత్రం ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. కానీ రిచర్డ్​సన్ వేసిన 110వ ఓవర్లో అనూహ్యంగా ఔటయ్యాడు. బంతిని బ్యాక్​ ఫుట్​ ఆడే క్రమంలో అతడి పాదం వికెట్లను తాకింది. దీంతో హిట్​ వికెట్​గా వెనుదిరిగాడు బట్లర్. అంతే ఆసీస్ శిబిరం ఆనందోత్సవాల్లో మునిగిపోయింది. ఎంతో పట్టుదలతో ఆడిన ఈ ఇంగ్లాండ్ వికెట్ కీపర్​.. ఇంత చెత్తగా ఔటవ్వడం పట్ల అభిమానులు నిరాశ చెందారు.

అనంతరం మరో 10 పరుగులు చేసి ఆలౌటైంది ఇంగ్లాండ్. దీంతో ఆస్ట్రేలియా 275 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. సిరీస్​లో 2-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్​లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్​లో అర్ధసెంచరీతో మెరిసిన లబుషేన్​కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.

ఇవీ చూడండి: Ashes 2021: రెండో టెస్టూ ఆసీస్​దే.. ఇంగ్లాండ్​కు తప్పని ఓటమి

ABOUT THE AUTHOR

...view details