విరాట్ కోహ్లీ(virat kohli news) మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ సీజన్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథ్య బాధ్యతల(virat kohli rcb captain news) నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికే టీ20 జట్టు సారథ్యం నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు విరాట్(పూర్తి కథన కోసం ఇక్కడ క్లిక్ చేయండి). లీగ్ మొదలైనప్పటి నుంచి ఆర్సీబీకే ఆడిన ఇతడు.. ఇలాంటి అనూహ్య నిర్ణయం తీసుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై పలువురు పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీమ్ఇండియా స్పిన్నర్, ఆర్సీబీ మరో ఆటగాడు యుజ్వేంద్ర చాహల్(yuzvendra chahal virat kohli) కెప్టెన్సీ నుంచి విరాట్(virat kohli news) తప్పుకోవడం పట్ల స్పందించాడు.
"అది భారత జట్టైనా, ఆర్సీబీ అయినా.. ఎల్లపుడూ పరుగులు సాధించడం, జట్టుకు విజయాన్ని అందించడంపైనే కోహ్లీ దృష్టిసారిస్తాడు. రెండు జట్ల(భారత్, ఆర్సీబీ)కు ఆడినపుడు అతడి నుంచి నాకు మార్గదర్శకత్వం లభించింది. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సీజన్‌ను మేము చాలా గొప్పగా ప్రారంభించాం. ప్రస్తుతం మా ఖాతాలో 10 పాయింట్లు ఉన్నాయి. ఇదే గెలుపు జోరును కొనసాగిస్తాం. తొలి టైటిల్ గెలవడానికి మాకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. కోహ్లీ ఈసారి జట్టుకు ట్రోఫీ అందిస్తాడని కచ్చితంగా నమ్ముతున్నా."