ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో.. భారత్‌పై పాక్ గెలిచి గ్రూప్ దశలో ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. అయితే.. చివరి ఓవర్లలో అత్యంత సులువైన క్యాచ్‌ను పేసర్ అర్ష్‌దీప్ వదిలేశాడు. పాక్ గెలవడానికి చివరి మూడు ఓవర్లలో 34 పరుగులు అవసరమైన దశలో రవి బిష్ణోయ్ 18వ ఓవర్ గొప్పగా వేశాడు.
అర్ష్‌దీప్ క్యాచ్ మిస్.. రోహిత్ సీరియస్.. వీడియో వైరల్
పాకిస్థాన్‌తో మ్యాచ్.. అప్పటి వరకూ గెలుపు అవకాశాలు మనకే ఎక్కువ.. అలాంటి సమయంలో సులువైన ఓ క్యాచ్‌ను నేలపాలు చేయడం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. భారత్‌ను ఓటమి వైపు నడిపించింది. ఇప్పుడు అందరూ ఆ క్యాచ్ గురించే చర్చించుకుంటున్నారు. దాని గురించే ఈ కథనం..
ఆ ఓవర్ మూడో బంతికి అసిఫ్ ఇచ్చిన తేలికైన క్యాచ్‌ను షార్ట్ థర్డ్‌మ్యాన్‌లో ఉన్న అర్ష్‌దీప్ జారవిడిచాడు. ఆ తర్వాత అసిఫ్ బౌండరీలతో చెలరేగాడు. ఈ క్యాచ్ జారవిడవడంపై కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాడు. మైదానంలో తన కోపాన్ని నియంత్రించుకోలేకపోయాడు. రోహిత్ స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక.. క్యాచ్ వదిలేసిన అర్ష్‌దీప్‌పై విమర్శలు వ్యక్తమవుతుండగా.. పలువురు మాజీలు మద్దతుగా నిలుస్తున్నారు. ఎవరూ క్యాచ్‌లను ఉద్దేశపూర్వకంగా వదిలేయరని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అతడికి మద్దతుగా నిలిచాడు.
ఇదీ చూడండి:నేను చేసిన ఆ పనికి ధోనీ మాత్రమే స్పందించాడు: కోహ్లీ