తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాక్​తో మ్యాచ్​.. మిస్​క్యాచ్​ వల్ల రాత్రంతా అర్షదీప్​ అలా చేశాడా? - అర్షదీప్​ పాకిస్థాన్​ మ్యాచ్​

ఆసియాకప్​లో భాగంగా పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో కీలకమైన క్యాచ్​ మిస్​ కావడం వల్ల అర్షదీప్​పై విపరీతమైన విమర్శలు వచ్చాయి. ట్రోలింగ్​కు గురయ్యాడు. అయితే దీనిపై అర్షదీప్​ ఏమన్నాడంటే..

arshadeep singh miss catch
అర్షదీప్ సింగ్ మిచ్ క్యాచ్

By

Published : Sep 14, 2022, 11:50 AM IST

ఆసియాకప్‌ సూపర్‌ 4లో పాక్‌ చేతిలో ఓటమిపాలైంది టీమ్​ఇండియా. అయితే ఈ మ్యాచ్​ ఓటమికి కారణాల్లో ఒకటి.. పాక్‌ బ్యాటర్‌ అసిఫ్‌ అలీ క్యాచ్‌ను అర్ష్‌దీప్‌ వదిలేయడం. దీనికి తోడు చివరి ఓవర్‌లో పాక్‌ ఏడు పరుగులు చేయకుండా అర్ష్‌దీప్‌ విశ్వప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. దీంతో అతడిపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. దీంతో పలువురు మాజీలు అతడికి అండగా కూడా నిలిచారు. మద్దతు నిచ్చారు. అయితే ఈ మ్యాచ్‌ అనంతరం అతడు తీవ్ర నిరాశకు గురయ్యాడు. మరో పక్క ట్రోలర్లు అతడి వెనకపడ్డారు. ఆ సమయంలో అర్ష్‌దీప్‌ తన కోచ్‌ జశ్వంత్‌ రాయ్‌తో మాట్లాడాడు. తన ఆటతీరుపై నిరాశ వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా రాయ్‌ మీడియాకు తెలిపాడు.

"క్యాచ్‌ వదిలేసిన తర్వాత.. చివరి ఓవర్‌లో ఏడు పరుగులను అడ్డుకొనేందుకు విశ్వప్రయత్నం చేశాడు. కానీ సాధ్యంకాలేదు. అందరు ఆటగాళ్ల వలే అతడు కూడా ఒత్తిడికి లోనయ్యాడు. 'ఈ రాత్రికి నాకు నిద్రపట్టదు' అని నాతో అన్నాడు. క్యాచ్‌ వదిలేయడంపై వస్తున్న ట్రోలింగ్స్‌ గురించి కూడా అర్ష్‌దీప్‌ చెప్పాడు. బాగానే ఆడావు. బాధపడవద్దని చెప్పాను. యార్కర్‌కు చేసిన యత్నం ఫుల్‌టాస్‌గా మారడంపై అతడు ఆలోచించడంలేదు. టీ20 ప్రపంచ కప్‌ ప్రతి క్రికెటర్‌కు పెద్ద వేదిక‌. అర్ష్‌దీప్‌లో తప్పులను గుర్తించి సరిచేసుకునే లక్షణం ఉంది. అది అతడికి, భారత్‌కు ఉపయోగపడుతుంది" అని జశ్వంత్‌ పేర్కొన్నాడు. ఆసియాకప్‌లో పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌ రెండు వికెట్లు తీసుకొన్నాడు. తాజాగా టీ20 ప్రపంచ కప్‌ జట్టులో కూడా భాగస్వామి అయ్యాడు.

ఇదీ చూడండి: సచిన్​పై ఫ్యాన్స్ సెటైర్లు​​..​ ఎందుకయ్యా ఇలా చేశావంటూ

ABOUT THE AUTHOR

...view details