పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్‌ను టీమ్‌ఇండియా యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ కలవడానికి వెళ్లిన సమయంలో వారి మధ్య జరిగిన ఓ ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఈ విషయాన్ని అర్ష్‌దీప్ కోచ్ జశ్వంత్ రాయ్ తాజాగా తెలిపాడు.
"సర్దార్‌జీ నువ్వు చాలా బాగా బౌలింగ్ చేస్తున్నావు. నువ్వు గొప్ప బౌలర్‌వి. అయితే నువ్వు ఆటలో నిన్ను నువ్వు పరిపూర్ణుడిగా అనుకుంటే మాత్రం నా దగ్గరకు రావద్దు. నా నుంచి ఏదైనా నేర్చుకోవాలి, ఏదైనా అడగాలని అనుకుంటే ఎప్పుడైనా నన్ను కలవచ్చు అని చెప్పాడట. ఆరోజు రాత్రి హోటల్ రూమ్‌కు వెళ్లిన తర్వాత కూడా అర్ష్‌దీప్ అదే అలోచిస్తూ గడిపాడు. ఒకవేళ తను వసీమ్‌ను కలవడానికి వెళ్లకపోతే తనకంతా తెలుసునని ఎక్కడ అర్థం చేసుకుంటాడోనని మరుసటి రోజే అతన్ని కలవడానికి వెళ్లానని నాతో చెప్పాడు" అని కోచ్ జశ్వంత్ వివరించాడు. ఆ విధంగా వీరిద్దరూ కలుసుకున్నారని తెలిపాడు.