తెలంగాణ

telangana

ETV Bharat / sports

డబ్ల్యూటీసీ ఫైనల్​ కోసం ప్రేక్షకులకు అనుమతి - భారత్-న్యూజిలాండ్ డబ్య్లూటీసీ ఫైనల్

భారత్-న్యూజిలాండ్ మధ్య జరగబోయే టెస్టు ఛాంపియన్​షిప్ ఫైనల్​కు ప్రేక్షకుల్ని అనుమతిస్తామని తెలిపారు హాంప్​షైర్​ క్లబ్ హెడ్ రోడ్ బ్రన్స్​గ్రోవ్. 4 వేల మంది ఫ్యాన్స్​ ఈ మ్యాచ్ వీక్షించే అవకాశం ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

Hampshire
హాంప్​షైర్

By

Published : May 20, 2021, 2:09 PM IST

సౌథాంప్టన్ వేదికగా భారత్​-న్యూజిలాండ్ మధ్య టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ జరగనుంది. జూన్ 18-22 వరకు ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. అయితే కరోనా దృష్ట్యా ఈ మ్యాచ్​కు ప్రేక్షకుల్ని అనుమతిస్తారా? లేదా? అన్న విషయమై కొన్ని అనుమానాలు ఉండేవి. తాజాగా హాంప్​షైర్​ కౌంటీ క్లబ్​ ఈ విషయంపై స్పష్టతనిచ్చింది. ఈ మ్యాచ్​కు 4 వేల మంది ప్రేక్షకులకు అనుమతి ఇస్తామని తెలిపారు క్లబ్ హెడ్​ రోడ్ బ్రన్స్​గ్రోవ్.

యూకేలో కరోనా విజృంభణ కాస్త కుదుటపడింది. దీంతో హాంప్​షైర్ వేదికగా ప్రారంభమైన కౌంటీ మ్యాచ్​కు 1500 మంది ప్రేక్షకులకు అనుమతిచ్చారు. ఈ వేదికగానే డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది.

"హాంప్​షైర్ వేదికగా నాలుగు రోజుల కౌంటీ మ్యాచ్ ఈరోజు నుంచి జరగనుంది. ఈ మ్యాచ్​ కోసం ప్రేక్షకులకు అనుమతి ఇస్తున్నాం. 2019 సెప్టెంబర్ తర్వాత ఫ్యాన్స్​ను అనుమతించడం ఇదే తొలిసారి. రేపటి నుంచి మరికొన్ని మ్యాచ్​లు మొదలవుతాయి. వాటికీ ప్రేక్షకులు వస్తారు. డబ్ల్యూటీసీ ఫైనల్​ కోసం ఐసీసీ స్పాన్సర్లు, వాటాదారులకు 50 శాతం వరకు టికెట్లు పోగా.. మరో 2000 టికెట్లను అమ్మకానికి ఉంచుతాం. ఇప్పటికే చాలామంది ఈ టికెట్లపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మ్యాచ్​కు చాలా డిమాండ్ ఉంది."

-రోడ్ బ్రన్స్​గ్రోవ్, హాంప్​షైర్ క్లబ్ హెడ్

ఈ సిరీస్​ కోసం జూన్ 2న ఇంగ్లాండ్ బయలుదేరనుంది టీమ్ఇండియా. అంతకంటే ముందు రెండు వారాల పాటు ముంబయిలో క్వారంటైన్​లో ఉండనున్నారు. మళ్లీ ఇంగ్లాండ్ చేరుకున్నాక మరో 10 రోజులు సౌథాంప్టన్​లో క్వారంటైన్​కు వెళ్లనున్నారు.

ABOUT THE AUTHOR

...view details