తెలంగాణ

telangana

ETV Bharat / sports

'మన్కడింగ్'​పై అర్జున్ తెందుల్కర్​.. అలా చేయడం కరెక్ట్​ అంటూ.. - రంజీ ట్రోఫీ అర్జున్ తెందుల్కర్​ మన్కడింగ్​

టీమ్​ఇండియా దిగ్గజ క్రికెటర్​ సచిన్‌ తెందుల్కర్​ తనయుడు గోవా ఆల్‌రౌండర్‌ అర్జున్ తెందుల్కర్​.. మన్కడింగ్​పై తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఏమన్నాడంటే..

Arjun tendulkar about Mankading
'మన్కడింగ్'​పై అర్జున్ తెందుల్కర్​.. అలా చేయడం కరెక్ట్​ అంటూ..

By

Published : Jan 18, 2023, 3:08 PM IST

టీమ్​ఇండియా దిగ్గజ క్రికెటర్​ సచిన్‌ తెందుల్కర్​ తనయుడు.. ఆల్​రౌండర్​ అర్జున్‌ తెందుల్కర్. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునేందుకు ఎంతో శ్రమిస్తున్నాడు. వచ్చిన అవకాశాల్ని స్వదినియోగం చేసుకుంటూ మేటి క్రికెటర్‌గా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ​ 'మన్కడింగ్‌' గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మన్కడింగ్‌ తప్పు కాదని, అయితే తను మాత్రం ఈ విధంగా రనౌట్‌లో భాగమై సమయం వృథా చేసుకోనని అన్నాడు. రంజీ టోర్నీలో గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. సర్వీసెస్‌తో మ్యాచ్‌లో మొదటి రోజు ఆటలో రెండు వికెట్లు తీశాడు.

అనంతరం ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్జున్​.. మన్కడింగ్​పై తన అభిప్రాయం తెలిపాడు. "మన్కడింగ్‌ను నేను పూర్తిగా సమర్థిస్తా. నిబంధనల ప్రకారం అది సరైందే. ఇలా రనౌట్‌ చేయడం క్రీడాస్ఫూర్తికి విర్ధుమంటే నేను ఒప్పుకోను. అయితే, నేను మాత్రం నాన్‌ స్ట్రైకర్‌ను మన్కడింగ్‌ చేసి సమయం వృథా చేసుకోను. బెయిల్స్‌ను పడగొట్టడానికి నేను నా వేగాన్ని తగ్గించుకోలేను. మన్కడింగ్‌ చేయాలంటే చాలా వరకు ఎనర్జీ, ఎఫర్ట్​ పెట్టాల్సి ఉంటుంది. నేను అలా నా శక్తి, సమయన్ని వృథా చేయను. అయితే, ఎవరైనా మన్కడింగ్‌ చేస్తే దానిని మాత్రం సమర్థిస్తా" అని పేర్కొన్నాడు.

సచిన్‌ మద్దతు.. మన్కడింగ్‌ అంటే క్రికెట్​ అభిమానులకు టక్కున గుర్తొచ్చే పేరు రవిచంద్రన్‌ అశ్విన్‌. అతడితో పాటు పలువురు బౌలర్లు ఈ మన్కడింగ్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్నప్పుడు సచిన్‌ వారికి మద్దతు కూడా పలికాడు.

ఇదీ చూడండి:జంతర్​ మంతర్​ ఎదుట బైఠాయించిన రెజ్లర్లు.. ఫెడరేషన్​కు వ్యతిరేకంగా నిరసనలు..!

ABOUT THE AUTHOR

...view details