తెలంగాణ

telangana

ETV Bharat / sports

Virat Kohli And Hardik watches : హార్దిక్ దగ్గర రూ.5 కోట్ల వాచ్​.. కోహ్లీది ఎంతో తెలుసా? - హార్దిక్​ పాండ్య ఖరీదైన వాచ్​

Virat Kohli And Hardik watches : టీమ్​ఇండియా స్టార్​ కికెటర్​ విరాట్​ కోహ్లీకి ఖరీదైన వాచ్​లంటే ఎంతో ఇష్టం. ఇప్పటికే తన ఇంటి వార్డ్​ రోబ్ నిండా ఎన్నో వాచ్​లతో నింపేశాడు. అయితే అతనికంటే హార్దిక్​ పాండ్య వద్దనే అత్యంత ఖరిదైన వాచ్​ ఉందంట. ఆ వివరాలు..

Virat Kohli And Hardik watches
Virat Kohli And Hardik watches

By

Published : Aug 3, 2023, 8:37 PM IST

Virat Kohli Watch Collection : స్టార్​ క్రికెటర్స్​లో ఒక్కోక్కరికి ఒక్కో వస్తువు అంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది. మిస్టర్​ కూల్​ మహేంద్ర సింగ్ ధోనీకి బైక్స్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన వద్ద వందల కొద్ది బైక్స్​ కలెక్షన్స్​ ఉన్నాయి. ఆ వాహనాలను పెట్టుకునేందుకు రాంచీలోని ఫామ్​ హౌస్​లో ఓ స్పెషల్​ గ్యారేజ్​ను సైతం ఏర్పాటు చేసుకున్నాడు. ఇక మాహీ లాగే రన్నింగ్​ మెషిన్​ విరాట్ కోహ్లీకి కూడా వాచ్​లు అంటే ఎంతో ఇష్టమట. తన ఇంటి నిండా ఇప్పటికే ఎన్నో రకాల వాచ్​ కలెక్షన్స్​​ ఉన్నట్లు అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో విరాట్ తెలిపాడు.

ఇక విరాట్ కోహ్లీ ఇంట్లోని వార్డ్‌ రోబ్‌లో దాదాపు అన్నీ ఖరీదైన వాచ్​లే ఉంటాయి. అందులో రోలెక్స్ వాచీలే ఎక్కువ ఉంటాయట. ఇటీవలే వెస్టిండీస్ టూర్‌లో విరాట్ కోహ్లీ తన చేతికి ఓ రోలెక్స్ వాచ్​ పెట్టుకుని కనిపించాడు. కాస్మోగ్రాఫ్ డేటోనా ఎవరోస్ అనే ఈ గోల్డ్ కలర్​ వాచ్​.. ఖరీదు దాదాపు రూ.88 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. దీంతో పాటు రోలెక్స్ కంపెనీకి చెందిన డేట్‌జస్ట్ 41 అనే వాచీ కూడా విరాట్ దగ్గర ఉంది. 18 క్యారెట్స్ గోల్డ్‌, డైమండ్స్‌తో తయారుచేసిన ఈ వాచ్​ ఖరీదు సుమారు రూ.9 లక్షల రూపాయలని అంచనా.

అంతేకాకుండా విరాట్​కు వాచీలను కానుకగా ఇచ్చే అలవాటు కూడా ఉందట. అలా ఇప్పటి వరకు అతను శుభ్​మన్​ గిల్, ఏబీ డివిల్లియర్స్, ఫాఫ్ డుప్లిసిస్ లాంటి స్టార్స్​కు ఖరీదైన వాచ్​లను గిఫ్ట్‌గా ఇచ్చాడు. అలాగే ఎవరైన క్రికెటర్ తన చేతికి వాచీ వేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే, దాని గురించి ఆరా తీయడంతో పాటు దాన్ని వెంటనే కొనుగోలు చేసే అలవాట్లు కూడా విరాట్‌ కోహ్లీకి ఉన్నాయట.

Hardik Pandya Expensive Watch : అయితే టీమ్​ఇండియాలో అత్యంత ఖరీదైన వాచీ ఉన్నది మాత్రం ఆల్​రౌండర్​ హార్ధిక్ పాండ్యా దగ్గరేనట. అతను ధరించే పటెక్ ఫిలిప్పీ రిస్ట్ వాచ్​ ధర సుమారు రూ.5 కోట్లు ఉంటుందని అంచనా. అంతే కాకుండా ఆ వాచీలో 32 ఖరీదైన వజ్రాలు పొదగి ఉంటాయట.

ABOUT THE AUTHOR

...view details