అనుష్క శర్మ: 88 బంతుల్లో 52 పరుగులు(5 ఫోర్లు, ఒక సిక్స్).. అదేంటీ.. బాలీవుడ్ నటి, టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ క్రికెట్ ఆడిందా? అందులోనూ అర్ధశతకం చేసిందా?ఎక్కడ ఆడింది.. సినిమాలోనా.. నిజంగానా.. ఈ వార్త చూడగానే ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటున్నారు కదూ..! మీరే కాదండి.. బీసీసీఐ ఈ ట్వీట్ చేసినప్పటి నుంచి యావత్ క్రికెట్ ప్రియుల పరిస్థితి ఇదే. అయితే ఇందులో బీసీసీఐ పేర్కొన్న అనుష్క శర్మ.. విరాట్ కోహ్లీ సతీమణి కాదు. భారత మహిళల అండర్ 19 క్రికెటర్. అసలేం జరిగిందంటే..
అనుష్క హాఫ్ సెంచరీ చేసిందా?.. కోహ్లీపై ఫన్నీ మీమ్స్! - అనుష్క శర్మ బీసీసీఐ ట్వీట్
టీమ్ఇండియా సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ క్రికెట్ ఆడిందా? 88 బంతుల్లో 52 పరుగులు చేసిందా? ఎక్కడ ఆడింది? సినిమాలోనా.. నిజంగానా.. ఈ వార్త చూడగానే ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటున్నారా? అయితే అదేంటో తెలుసుకోండి.
మహిళల అండర్ 19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ 2021-22 టోర్నమెంట్ మంగళవారం ప్రారంభమైంది. ఇందులో దేశవాళీ మహిళా క్రికెటర్లను టీమ్ ఏ, బీ, సీ, డీ ఇలా నాలుగు జట్లుగా విభజిస్తారు. ప్రతి జట్టు రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. టాప్ రెండు స్థానాల్లో ఉన్న జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. నవంబరు 2 నుంచి 7వ తేదీ వరకు ఈ టోర్నీ సాగనుంది. ఇందులో 'టీమ్ బి' జట్టు కెప్టెన్ పేరు అనుష్క బ్రిజ్‌మోహన్ శర్మ. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ జరుగుతుండగా.. బీసీసీఐ ఉమెన్(bcci women) ట్విట్టర్ ఖాతాలో ఓ అప్‌డేట్ ఇచ్చారు. అందులో 'అనుష్క శర్మ 88 బంతుల్లో 52 పరుగులు' అని రాసి ఉంది.
దీంతో ఈ ట్వీట్ కాస్తా నెటిజన్లను ఆశ్చర్యానికి, గందరగోళానికి గురిచేసింది. అనుష్క పేరు చూడగానే విరాట్ సతీమణి అనే అంతా అనుకున్నారు. అంతేనా.. కోహ్లీని విమర్శించేందుకు బీసీసీఐ ఇలా చేసిందేమో అని పొరబడ్డారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారడం వల్ల నెటిజన్లు కోహ్లీని ఉద్దేశిస్తూ ఫన్నీ పోస్టులు, మీమ్స్ పెడుతున్నారు. "అనుష్క మ్యాచ్ ఆడేందుకు వెళ్లిందని ఎందుకు చెప్పలేదు. అక్కడ వామికా ఏడుస్తోంది" అని కోహ్లీ అంటున్నట్లుగా మీమ్స్ తయారుచేశారు.