Anushka sharma emotional post about virat kohli: టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన నేపథ్యంలో విరాట్ కోహ్లీకి అనుష్క శర్మ సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ సందేశం పోస్టు చేసింది.
'కోహ్లీ ఆ రోజు ఇంకా గుర్తుంది'.. అనుష్క ఎమోషనల్ పోస్ట్ - అనుష్క శర్మ ఎమోషనల్ పోస్ట్
Anushka sharma emotional post about virat kohli: టెస్టు కెప్టెన్సీకి కోహ్లీ గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో అతడి భార్య అనుష్క శర్మ ఓ ఎమోషన్ల్ సందేశాన్ని పోస్ట్ చేసింది. టీమ్‌ఇండియా కెప్టెన్‌గా విరాట్ ఎదుగుదలతో పాటు సాధించిన విజయాలకు తానెంతో గర్వపడుతున్నట్లు చెప్పింది.
"2014లో ఎంఎస్ ధోనీ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ కాబోతున్నాడని .. తదుపరి భారత కెప్టెన్‌గా ఎంపిక అవుతున్నట్లు చెప్పిన రోజు నాకింకా గుర్తుంది. ఆ తర్వాత ఓ రోజు మహీ, నువ్వు, నేనూ మాట్లాడుకుంటూ 'నీ గడ్డం ఎంత త్వరగా నెరిసిపోతుందో చూడు' అని ధోనీ వేసిన జోక్‌ను బాగా ఎంజాయ్ చేశాం. ఆ రోజు నుంచి నీ గడ్డం నెరవడం చూడటమే కాకుండా నీలో ఎంతో వృద్ధిని చూశా. టీమ్‌ఇండియా కెప్టెన్‌గా నీ ఎదుగుదలతో పాటు సాధించిన విజయాలకు ఎంతో గర్వపడుతున్నా. 2014లో మనం ఎంతో అమాయకంగా ఉన్నాం. మంచి ఉద్దేశాలు, సానుకూల దృక్పథం, స్ఫూర్తి.. మాత్రమే జీవితంలో మనల్ని ముందుకు తీసుకెళ్తాయని భావించాం. కానీ, వీటితో పాటు జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మైదానంలోనే మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా నువ్వు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నావు. ఇదే కదా జీవితం అంటే. నీ గొప్ప దృక్పథానికి ఎలాంటి అడ్డంకులు రానీయకుండా మైదానంలో గెలుపు కోసం శక్తిమేర ప్రయత్నించావు. కొన్ని ఓటముల తర్వాత నీవు బాధతో ఉన్న క్షణాల్లో నేను నీ పక్కనే ఉన్నా. 'నేను ఇంకా గొప్పగా రాణించి ఉండాల్సింది' అని అనుకునేవాడివి. ఇదే నీ గొప్పతనం. నీ అభిమానులకు, నాకు నచ్చే విషయం కూడా ఇదే.' అని అనుష్క భావోద్వేగ పోస్ట్ చేసింది.
కెప్టెన్‌గా తన ఏడేళ్ల ప్రయాణంలో కోహ్లీ నేర్చుకున్న పాఠాల నుంచి వామిక ఎన్నో విషయాలు తెలుసుకుంటుందని ధీమా వ్యక్తం చేసింది అనుష్క. విరాట్ అసలు స్వరూపం అందరికీ అర్థం కాకపోయినా తనకు మాత్రం పూర్తి స్థాయిలో తెలుసని చెప్పుకొచ్చింది. కోహ్లీ.. ఏదీ దురాశతో చేయడని, ఈ కెప్టెన్ పదవి కోసం కూడా దురాశ పడలేదని అనుష్క తెలిపింది.
ఇదీ చూడండి: విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం