సచిన్ తెందుల్కర్‌ను తొలిసారి చూసిన అనుభవం గురించి గుర్తు చేసుకుంది అతని భార్య అంజలి. ఇంగ్లాండ్ పర్యటన అనంతరం స్వదేశానికి వచ్చిన లిటిల్ మాస్టర్‌ను మొదటగా ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో చూశానని వెల్లడించింది. అప్పటికీ అతడెవరో తనకు తెలియదని తెలిపింది. అప్పుడు 17 ఏళ్ల సచిన్.. తనకి 12 ఏళ్ల పిల్లాడిలా కనిపించాడని అంజలి తెలిపింది.
"అప్పుడు నాకు అతడెవరో తెలీదు. నా ఫ్రెండ్ అపర్ణ నాతో పాటు ఉంది. నాకు అతని గురించి చెప్పింది. క్రికెట్లో అతడొక అద్భుతమని.. అతి చిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడు అని తెలిపింది. క్రికెట్ పట్ల నాకు ఆసక్తి లేదు. అందుకే అతడెవరైతే నాకెంటని అనుకున్నా. కానీ, సచిన్ క్యూట్‌గా అనిపించి.. అతని వెంట పరుగెత్తా" అని అంజలి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది.
ఇదీ చదవండి:'టీవీలో సచిన్ ఆట చూసి ఆ షాట్లు నేర్చుకున్నా'