ప్రస్తుత ప్రపంచంలో సాంకేతికత భారీగా పెరుగుతుందని, తద్వారా క్రికెట్‌లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయని స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే అన్నాడు. భవిష్యత్లో డీఆర్‌ఎస్ (డెసిషన్ రివ్యూ సిస్టమ్,drs system in cricket) విధానంలో మరిన్ని మార్పులు సంభవిస్తాయన్నాడు. అదే జరిగితే ఏ క్రీడాకారుడూ 'డేటా ఇంటిలిజెన్స్'ను కొట్టిపారేయలేరని కుంబ్లే పేర్కొన్నాడు. ఓ యూనివర్శిటీ ఏర్పాటు చేసిన 'బిల్డింగ్ కాంపిటిటివ్ అడ్వాంటేజ్ త్రూ స్పోర్ట్స్ అనలిటిక్స్ అండ్ డేటా ఇంటెలిజెన్స్' అనే కార్యక్రమంలో పాల్గొన్న మాజీ స్పిన్నర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
క్రికెట్‌లో ఇప్పటికే డీఆర్‌ఎస్ విధానం అమలు చేస్తున్నారని, అది ఆటపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పాడు. ఈ టెక్నాలజీ మున్ముందు మరింత కొత్త పుంతలు తొక్కుతుందన్నాడు. ఆటగాళ్లు ఈ మార్పులను ఆహ్వానిస్తే బాగుంటుందని లేకపోతే వెనుకపడిపోతారని పేర్కొన్నాడు.