Australia Head Coach 2022: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ వచ్చేశాడు. దాదాపు రెండు నెలల తర్వాత ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ను ప్రధాన కోచ్‌గా నియమిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్ల కాలపరిమితితో మెక్‌డొనాల్డ్‌ను నియమించింది. "కోచ్‌గా అవకాశం కల్పించిన ఆసీస్ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు. ఇది నాకు లభించిన అతిపెద్ద గౌరవం. ప్రస్తుత జట్టులో ఉన్న అనుభవాన్ని వినియోగించుకుని పటిష్ఠంగా తయారు చేయడమే నా ముందున్న కర్తవ్యం. అదే ప్రణాళికతో వస్తున్నా. జట్టుగా పని చేసేందుకు ఎదురు చూస్తున్నా" అని మెక్‌డొనాల్డ్ తెలిపాడు.
Australia Head Coach: ఆసీస్ కొత్త కోచ్ అతడే.. అన్ని ఫార్మాట్లకు..
Australia Head Coach 2022: ఆసీస్ జట్టు హెడ్‌కోచ్‌గా ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ను నియమించింది క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ). నాలుగేళ్ల కాలపరిమితితో అతడికి బాధ్యతలను అప్పగించింది. జస్టిన్ లాంగర్ స్థానంలో ప్రధాన కోచ్‌గా సేవలందించనున్నాడు ఆండ్రూ.
గత యాషెస్ సిరీస్ తర్వాత అప్పటి వరకు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన జస్టిన్ లాంగర్ పదవీ కాలాన్ని కేవలం ఆరు నెలలే క్రికెట్ ఆస్ట్రేలియా పొడిగించింది. అయితే మరోసారి నాలుగేళ్ల కాంట్రాక్ట్ దక్కుతుందని ఆశించిన లాంగర్‌కు భంగపాటు తప్పలేదు. దీంతో పదవి నుంచి తప్పుకున్నాడు. లాంగర్ 2018లో ఆసీస్ జట్టు కోచింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. ఆ ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనలో బాల్ టాంపరింగ్ వివాదం తర్వాత కోచ్‌గా నియమితుడయ్యాడు. ఈ క్రమంలోనే ఆసీస్ రెండు సార్లు భారత్ చేతిలో బోర్డర్-గావస్కర్ సిరీస్‌లు కోల్పోయింది. అయితే, ఇటీవల టీ20 ప్రపంచకప్ గెలవడం, ఇంగ్లాండ్‌పై యాషెస్ సిరీస్ గెలవడం విశేషం. సీనియర్ ఆటగాళ్ల నుంచి మద్దతు లభించకపోవడం వల్ల లాంగర్ కాంట్రాక్ట్‌ను నాలుగేళ్లకు పెంచేందుకు సీఏ నిరాకరించింది.