దుబాయ్(Dubai) వేదికగా జరుగుతోన్న పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL)లో విండీస్ క్రికెటర్ ఆండ్రీ రస్సెల్(Andre Russell) తలకు ప్రమాదవశాత్తూ బంతి తగిలింది. దీంతో కొంత అసౌకర్యానికి గురైన రస్సెల్‌ను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. పెద్ద ప్రమాదమేమీ జరగనప్పటికీ సీటీ స్కాన్ నిమిత్తమే ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
క్వెట్టా గ్లాడియేటర్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ జట్ల మధ్య శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఈ సంఘటన జరిగింది. లీగ్‌లో గ్లాడియేటర్స్‌కు ఆడుతున్న రస్సెల్.. 14వ ఓవర్లో బ్యాటింగ్‌కు దిగాడు. ముహమ్మద్ ముసా బౌలింగ్‌లో వరుస సిక్లర్లు బాది ఊపు మీద కనిపించాడీ విండీస్ ఆల్‌రౌండర్. తదుపరి బంతికే ముసా బంతిని షాట్ ఆడబోయి తలకు తగిలించుకున్నాడు. ఆ మరుసటి బంతికే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.