National Blind Cricket Tournament: జాతీయ అంధుల టీ20 క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ విజేతగా నిలిచింది. గురువారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఏపీ 27 పరుగుల తేడాతో కర్ణాటకను ఓడించింది.
మొదట ఏపీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 231 పరుగులు చేసింది. వెంకటేశ్వరరావు (85 పరుగులు, 36 బంతుల్లో) రాణించాడు. ఛేదనలో కర్ణాటక 3 వికెట్లకు 204 పరుగులే చేయగలిగింది. ఈ టోర్నీలో లీగ్ దశలో ఆంధ్రప్రదేశ్ ఆడిన అయిదు మ్యాచ్‌లూ గెలిచింది.