ఆంధ్రా క్రికెట్ కెప్టెన్ హనుమ విహారీ క్రికెట్ ఆటపై తనకున్న అంకితభావాన్ని మరోసారి చూపించాడు. మధ్యప్రదేశ్‌తో జరుగుతోన్న రంజీ క్వార్టర్ ఫైనల్లో విరోచిత పోరాటం చేశాడు. చేయి ఫ్రాక్చర్ అయినా సరే లెక్కచేయకుండా ఒంటి చేత్తోనే బ్యాటింగ్ చేసి జట్టుకు భారీ స్కోరును అందించాడు. దీంతో అందరి ప్రశంసలు పొందున్నాడు.
మణికట్టు విరిగినా ఒంటిచేత్తో పోరాటం.. రంజీలో ఆంధ్ర సారథి హనుమ 'విహారం'..
ఆంధ్రా క్రికెట్ కెప్టెన్ హనుమ విహారీ రంజీలో విజృంభించాడు. క్రికెట్ పట్ల తనకున్న ఇష్టాన్ని మరోసారి నిరూపించాడు. మధ్యప్రదేశ్‌తో జరగుతున్న రంజీ ట్రోఫీ చేయి ఫ్రాక్చర్ అయినా ఒంటిచేత్తోనే పోరాటం చేసి అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు.
ఇదీ జరిగింది.. మధ్యప్రదేశ్‌తో జరుగుతోన్న రంజీ క్వార్టర్స్ మ్యాచ్ ప్రస్తుతం రెండో రోజు కొనసాగుతోంది. 262/2తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆంధ్రా.. మరో 117 పరుగులు జోడించి 8 వికెట్లు కోల్పోయింది. ఈ ఇన్నింగ్స్‌లో రికీ భుయ్, కరణ్ శిందే అద్భుత శతకాలతో విజృంభించడంతో.. ఆంధ్రా టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులకు ఆలౌటైంది. అయితే మొదటి రోజు ఆటలో.. అవేశ్ ఖాన్ చేతిలో ఎడమచేతి మణికట్టు ఫ్రాక్చర్‌కు గురయ్యాడు. దీంతో అతడు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది.
ఆ తర్వాత రెండో రోజు ఆటలో కరణ్ షిండే, రికీ భుయ్ సెంచరీల బాదిన తర్వాత వెంటవెంటనే పెవిలియన్ చేరారు. ఒకానొక దశలో 30 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి చతికిలపడింది. అప్పుడు 353/9 దశలో తన గాయాన్ని సైతం లెక్కచేయకుండా నొప్పిని భరిస్తూనే.. విహారి (57 బంతుల్లో 27; 5 ఫోర్లు) ఎంట్రీ ఇచ్చాడు. ఒంటి చేత్తోనే వీరోచిత పోరాటం చేశాడు. 26 పరుగులు చేసి ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. ఇకపోతే అందులో రెండు బౌండరీలు బాదడం విశేషం. అందులో ఒకటి ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లోనే కావడం మరో విశేషం. దీంతో అతడి మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచాడు. విహారి సాహోసపేతమైన పోరాటానికి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. సలాం విహారి.. నువ్వు నిజమైన పోరాట యోధుడివి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.