తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఈ బౌలింగ్‌ దళం అత్యుత్తమమైంది: ఆకాశ్ చోప్రా - commentator akash chopra

టీమ్‌ఇండియాకు ఉన్న బౌలింగ్ లైనప్‌ భారత టెస్టు క్రికెట్‌లోనే ఉత్తమమైందని ప్రశంసించాడు కామెంటేటర్​ ఆకాశ్​ చోప్రా. ఇందులో ఎలాంటి సందేహం లేదని చెప్పాడు. అందుకు గల కారణాన్ని వివరించాడు.

teamindia
టీమ్​ఇండియా

By

Published : Aug 19, 2021, 6:37 PM IST

లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. అయితే, ఈ విజయంలో ముఖ్యపాత్ర పోషించింది భారత బౌలింగ్‌ దళమే. ఇంగ్లాండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 120 పరుగులకే ఆలౌట్‌ చేసి భారత్‌కు ఘనవిజయాన్ని అందించారు మన బౌలర్లు. ఈ నేపథ్యంలో భారత బౌలింగ్‌ దళంపై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం టీమ్‌ఇండియాకున్న బౌలింగ్ లైనప్‌ భారత టెస్టు క్రికెట్‌లోనే ఉత్తమమైనదిగా భావిస్తున్నానని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నాడు.

"ప్రస్తుతం టీమ్‌ఇండియాకున్న బౌలింగ్‌ లైనప్‌ భారత టెస్టు క్రికెట్‌లోనే అత్యుత్తమమైంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మేం క్రికెట్ ఆడుతున్న సమయంలో అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్‌లాంటి దిగ్గజ స్పిన్నర్లు ఉన్నప్పటికీ నాలుగు లేదా ఐదుగురు ఫాస్ట్‌బౌలర్లు లేరు. హర్భజన్‌సింగ్‌, జహీర్‌ఖాన్‌, అనిల్‌ కుంబ్లే వంటి బౌలర్లు జట్టు కోసం ఎన్నో అద్భుతాలు చేశారు. కొంత కాలం జహీర్‌ఖాన్‌, అజిత్ అగార్కర్‌, ఆశిష్ నెహ్రా, ఆర్పీ సింగ్‌ వంటి బౌలర్లు ఉన్నప్పటికీ.. ఇప్పుడు ఉన్న విధంగా బౌలింగ్‌ లైనప్‌ లేదు. ప్రస్తుతం బుమ్రా, షమీ, ఇషాంత్, సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ వంటి బౌలర్లతో బౌలింగ్‌ దళం పటిష్టంగా ఉంది"

-ఆకాశ్ చోప్రా, కామెంటేటర్​.

"స్పిన్నర్ల విషయానికొస్తే.. హర్భజన్‌సింగ్‌ పాత్రను రవిచంద్రన్ అశ్విన్‌ పోషిస్తుండగా.. అనిల్‌ కుంబ్లే వంటి బౌలర్‌ రవీంద్ర జడేజా రూపంలో ఉన్నాడు. కాబట్టి భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంతకన్నా మెరుగైన బౌలింగ్‌ లైనప్‌ ఉందని అనుకోను" అని ఆకాశ్ చోప్రా అన్నాడు.

ఇదీ చూడండి: 'ఇంగ్లాండ్‌ భయపడిందని అప్పుడే అర్థమైంది'

ABOUT THE AUTHOR

...view details