తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అలా చేయడం వల్ల రహానేపై ఒత్తిడి పెరుగుతుంది'

Akash Chopra on Ajinkya Rahane: టీమ్ఇండియాలో పరిస్థితులు మారిపోతున్నాయని అభిప్రాయపడ్డాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా. టెస్టుల్లో కెప్టెన్​గా చేసిన రహానేను వైస్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పించడం, రాహుల్​కు డిప్యూటీ పదవి ఇవ్వడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపాడు.

Akash Chopra on Ajinkya Rahane, Ajinkya Rahane voice captaincy, రహానే వైస్ కెప్టెన్సీ, రహానే లేటెస్ట్ న్యూస్
Akash Chopra on Ajinkya Rahane

By

Published : Dec 20, 2021, 1:54 PM IST

Akash Chopra on Ajinkya Rahane: టీమ్‌ఇండియాలో పరిస్థితులు మారిపోతున్నాయని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు రోహిత్‌ శర్మ స్థానంలో కేఎల్‌ రాహుల్‌ను జట్టు యాజమాన్యం వైస్‌ కెప్టెన్‌గా నియమించింది. దీంతో ఇన్ని రోజులూ ఆ బాధ్యతలు చేపట్టిన అజింక్యా రహానెపై ఒత్తిడి పెరుగుతుందని అన్నాడు.

"దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు రోహిత్‌ గాయపడటం వల్ల.. అతడి స్థానంలో రాహుల్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించారు. ఇప్పుడు ద్రవిడ్‌ కోచ్‌గా ఉన్నాడు. రోహిత్‌ ఇటీవలే పూర్తిగా పరిమిత ఓవర్ల సారథ్యం చేపట్టాడు. రాహుల్‌ క్లిక్‌ అయితే, టెస్టుల్లో అజింక్యా రహానే స్థానం కోల్పోయే ప్రమాదం ఉంది. అజింక్యా గతంలో కొన్ని మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గానూ చేశాడు. అలాంటిది ఇప్పుడు వైస్‌ కెప్టెన్‌గానూ చోటు కోల్పోయాడు. దీంతో టీమ్‌ఇండియాలో పరిస్థితులన్నీ మారిపోతున్నాయని అర్థం చేసుకోవచ్చు."

-ఆకాశ్ చోప్రా, టీమ్ఇండియా మాజీ క్రికెటర్

IND vs SA Series: ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది టీమ్ఇండియా. ఈ టూర్​లో మూడు వన్డేలు, మూడు టెస్టులు ఆడనుంది. టెస్టు జట్టుకు కోహ్లీ సారథ్యం వహిస్తుండగా.. వన్డే ఫార్మాట్​కు రోహిత్ శర్మను సారథిగా ప్రకటించింది బీసీసీఐ. గాయం కారణంగా టెస్టు సిరీస్​కు దూరమైన హిట్​మ్యాన్.. వన్డే సిరీస్​ వరకు జట్టుతో కలిసే అవకాశం ఉంది.

ఇవీ చూడండి: 'మా మాటకు విలువిచ్చిన అందరికీ కృతజ్ఞతలు'

ABOUT THE AUTHOR

...view details