IPL 2022 rahaney injured: లఖ్‌నవూతో జరగాల్సిన మ్యాచ్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ అజింక్య రహానె గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. శనివారం ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో రహానె గాయపడ్డాడు. దీంతో చికిత్స కోసం అతడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో నాలుగు వారాలు పాటు ఉండనున్నాడు. ఇక జులైలో ఇంగ్లాండ్‌తో జరగనున్న సిరీస్‌లో భాగంగా రీషెడ్యూల్ టెస్టు మ్యాచ్‌కు అతడు దూరం కానున్నట్లు తెలిసింది.
కోల్‌కతాకు షాక్.. టోర్నీ నుంచి రహానె ఔట్.. ఇంగ్లాండ్ సిరీస్‌కు! - ajinkya rahane ipl 2022
IPL 2022 rahaney injured: గాయం కారణంగా కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయర్ రహానె టోర్నీ నుంచి వైదొలిగాడు. ఇక జులైలో ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టుకు అతడు దూరం కానున్నట్లు తెలిసింది.
రహానెకు గాయం
ఇక ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్.. 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. రహానె.. ఏడు మ్యాచులు ఆడి 133 పరుగులు చేశాడు. కాగా జట్టుకు రహానే దూరం కావడంతో వెంకటేశ్ అయ్యర్‌తో కలిసి నితీష్ రాణా ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఇక గ్రూపు దశలో తన చివరి మ్యాచ్‌లో కేకేఆర్ మే 18న లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది.
ఇదీ చూడండి: ఐపీఎల్ 2022 సరికొత్త రికార్డు.. అత్యధిక సిక్స్‌లు ఈ సీజన్లోనే...