భారత క్రికెట్ జట్టు ఆటగాడు అజింక్యా రహానే భార్య రాధిక బుధవారం ఉదయం మగబిడ్డకు జన్మనిచ్చింది. రహానే సోషల్ మీడియా ద్వారా అభిమానులకు శుభవార్త అందించాడు. రాధిక, ఆమె కుమారుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని రహానే తెలిపాడు.
రహానే ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక లేఖను షేర్ చేశాడు. ఇందులో బుధవారం ఉదయం తన భార్య రాధిక మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపాడు. ఈ లేఖ ద్వారా తన అభిమానులకు కృతజ్ఞతలు కూడా తెలిపాడు. "ఈ ఉదయం రాధిక, నేను.. నా మగ బిడ్డను ఈ ప్రపంచంలోకి స్వాగతించాము. రాధిక, బిడ్డ ఇద్దరూ బాగానే ఉన్నారు. మీ అందరీ ప్రార్థనలకు మేము ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అంటూ రాసుకొచ్చాడు.