తెలంగాణ

telangana

ETV Bharat / sports

'డిసెంబర్ ప్లేయర్ ఆఫ్ ది మంత్' ఎవరంటే?

Ajaz Patel POTM: డిసెంబర్ నెలకుగానూ 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్'​ విజేతను ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్​ ఈ అవార్డు దక్కించుకున్నట్లు తెలిపింది.

Ajaz Patel POTM, ICC Player of the Month for December, అజాజ్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మంత్, ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్
Ajaz Patel

By

Published : Jan 10, 2022, 2:33 PM IST

Updated : Jan 10, 2022, 2:53 PM IST

Ajaz Patel POTM: ప్రతి నెల అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' పేరిట అవార్డు అందిస్తోంది అంతర్జాతీయ క్రికెట్ మండలి. తాజాగా డిసెంబర్ నెలకుగానూ ఈ అవార్డు గ్రహీతను ప్రకటించింది. న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్​ ఈ అవార్డు దక్కించుకున్నట్లు తెలిపింది. టీమ్ఇండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్, ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్​తో పోటీపడి ఇతడు ఈ పురస్కారాన్ని దక్కించుకున్నాడు.

భారత్​-న్యూజిలాండ్ మధ్య ఇటీవల జరిగిన ముంబయి టెస్టులో 14 వికెట్లతో రెచ్చిపోయాడు అజాజ్ పటేల్. ఒకే ఇన్నింగ్స్​లో పది వికెట్లు పడగొట్టి.. ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్​గా నిలిచాడు. తద్వారా అనిల్ కుంబ్లే, జిమ్ లేకర్ వంటి దిగ్గజ స్పిన్నర్ల సరసన చేరాడు.

ఇవీ చూడండి: టీమ్ఇండియాకు కలిసిరాని కేప్​టౌన్.. మరి ఈసారైనా?

Last Updated : Jan 10, 2022, 2:53 PM IST

ABOUT THE AUTHOR

...view details