Ajaz Patel 10 Wickets In An Innings:న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్, రెండేళ్ల కిందట ఇదే రోజు టీమ్ఇండియాపై అరుదైన ఘనత అందుకున్నాడు. అతడు 2021లో ముంబయి వాంఖడే వేదికగా భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్ రెండో మ్యాచ్‌లో, తొలి ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో జిమ్ లేకర్ (1956), అనిల్ (1999) కుంబ్లే తర్వాత ఈ ఘనత అందుకున్న మూడో బౌలర్‌గా రికార్డులకెక్కాడు అజాజ్.
అతడు ఈ ఇన్నింగ్స్‌లో 47.5 ఓవర్లు బౌలింగ్ చేసి 10 వికెట్లు నేలకూల్చాడు. అందులో 12 ఓవర్లు మెయిడెన్లుగా మలిచాడు. అతడి ధాటికి టీమ్ఇండియాలో స్టార్ బ్యాటర్లు ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ సహా రవిచంద్రన్ అశ్వన్ డకౌట్ అయ్యారు. ఈ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ మయంక్ అగర్వాల్ (150) భారీ స్కోర్ చేయడం వల్ల టీమ్ఇండియా 325 పరుగులు సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియానే 372 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తుచేసింది.
Anil Kumble 10 Wickets : టీమ్ఇండియా లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 1999లో పాకిస్థాన్‌తో దిల్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో, ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో 26.3 ఓవర్లలో కుంబ్లే ఈ ఫీట్ సాధించాడు. దీంతో 43 ఏళ్ల తర్వాత, టెస్టు ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా కుంబ్లే చరిత్ర సృష్టించాడు. కాగా, భారత్‌లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ కుంబ్లేనే. గత 21 ఏళ్లుగా ఈ రికార్డు అతడి పేరిటే ఉంది.