తెలంగాణ

telangana

ETV Bharat / sports

MS Dhoni: అభిమాని సాహసం.. ధోనీని కలిసేందుకు పాదయాత్ర

ఓ అభిమాని సాహసం చేశాడు. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని కలిసేందుకు ఏకంగా 1400 కిలో మీటర్లు నడిచాడు. 17 రోజుల పాటు పాదయాత్ర చేసి మహీ స్వస్థలం రాంచీ చేరాడు. అక్కడికి చేరాక అసలు విషయం తెలిసి ఉసూరుమన్నాడు.

India vs England
ఇండియా vs ఇంగ్లాండ్​

By

Published : Aug 15, 2021, 10:14 PM IST

టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. భారత్‌లో మిస్టర్‌ కూల్‌ క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ధోనీపై అభిమానులు తమ అభిమానాన్ని ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటారు. తాజాగా ఓ అభిమాని సాహసమే చేశాడు. తన ఫేవరేట్‌ను కలిసేందుకు ఏకంగా 1400 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాడు. హరియాణాలోని తన గ్రామం నుంచి నడక ప్రారంభించిన అజయ్‌ గిల్‌ (18) అనే అభిమాని ఝార్ఖండ్‌లోని రాంచీకి చేరుకున్నాడు. జులై 29న పయనమైన అజయ్‌ 17 రోజుల పాటు నడిచి ధోనీ స్వస్థలమైన రాంచీకి చేరుకున్నాడు.

అజయ్ గిల్

ఇంత సాహసం చేసినా.. ఆ యువకుడికి నిరాశే ఎదురైంది. గిల్‌ రాంచీకి చేరుకునే రెండు రోజుల ముందే ఐపీఎల్‌ కోసం ధోనీ దుబాయ్‌కి పయనమయ్యాడు. అయినప్పటికీ తన ఫేవరేట్‌ తిరిగొచ్చేవరకు ఇక్కడే ఎదురుచూస్తానని ఈ యువకుడు పేర్కొన్నాడు. మహీని కలిసిన తర్వాతే తిరిగి వెళతానని చెప్పాడు. 'ఇంతదూరం కాలినడకన వచ్చినందుకు ధోనీ నాతో 10 నిమిషాలైనా మాట్లాడతాడు' అని ఆశాభావం వ్యక్తం చేశాడు అజయ్‌.

జాతీయ జెండాతో ధోనీ అభిమాని

తన స్వగ్రామంలోని ఓ సెలూన్‌లో పనిచేసే అజయ్‌ చాలా భిన్నంగా కనిపిస్తున్నాడు. జుట్టుకు పసుపు, ఆరెంజ్‌, నీలం రంగులు వేసుకొని.. తలకు రెండు వైపులా ధోనీ, మహీ అనే పేర్లతో దర్శనమిస్తున్నాడు. ధోనీని కలిసేందుకు నడుచుకుంటూ వెళుతున్నాననే విషయం తెలుసుకున్న సోనేపత్‌లోని ఓ బార్బర్‌ తనను ఇలా తయారుచేసినట్లు అజయ్‌ తెలిపాడు. క్రికెటర్‌ కావాలని కలలు కన్నానని.. కానీ ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత క్రికెట్‌ ఆడటం మానేశానని గిల్‌ తెలిపాడు. మహీ ఆశీర్వాదంతోనే మళ్లీ క్రికెట్‌ ఆడాలని భావిస్తున్నట్లు వివరించాడు.

తలపై ధోనీ పేరుతో

అజయ్‌ గురించి తెలుసుకున్న అనురాజ్‌ చావ్లా అనే వ్యక్తి.. యువకుడిని ఓ హోటల్‌ రూంకి తీసుకెళ్లారు. ధోనీ వచ్చేందుకు ఇంకా చాలారోజులు పట్టనుంది. దీంతో ఇంటికి వెళ్లాలని అతడికి సూచించారు. కాలినడకన వచ్చినందుకు అతడికి దిల్లీ వరకు విమాన టికెట్‌ను అందించారు. మహీ వచ్చాక మళ్లీ రావాలని అజయ్‌కి సూచించినట్లు అనురాగ్‌ తెలిపారు.

ఇదీ చదవండి:Ind vs Eng Test: కోహ్లీ, జిమ్మీ మాటల యుద్ధం

ABOUT THE AUTHOR

...view details