ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా టీమ్ఇండియా ఆటగాళ్లు అదరగొడుతున్నారు. యువ ఓపెనర్ శుభ్‌మన్ నిలకడైన ఆటతీరును కనపరిచాడు. 85 పరుగులతో సత్తా చాటాడు. మరో యువ కెరటం రిషభ్ పంత్ కేవలం 94 బంతుల్లోనే 121 పరుగులతో అజేయంగా నిలిచాడు. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ మూడు వికెట్లతో రాణించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
సత్తా చాటిన పంత్, గిల్.. ఇషాంత్‌కు 3 వికెట్లు - డబ్ల్యూటీసీ ఫైనల్
సౌథాంప్టన్ వేదికగా భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ మ్యాచ్‌లో సత్తా చాటారు. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, ఇషాంత్ శర్మ రాణించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్లో షేర్ చేసింది.
ఇషాంత్ శర్మ, రిషభ్ పంత్, ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్
"ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇది రెండో రోజు. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్.. 135 బంతుల్లో 85 రన్స్ చేశాడు. మరో ప్లేయర్ రిషభ్ పంత్ 94 బాల్స్‌లో 121* పరుగులు సాధించాడు. వెటరన్ పేసర్ ఇషాంత్ 36 పరుగులకే 3 వికెట్లు తీశాడు" అని బీసీసీఐ ట్వీట్ చేసింది.