పన్నెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులోకి వచ్చిన సీనియర్ బౌలర్ జయ్‌దేవ్ ఉనద్కత్ తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్టులో ప్రస్తుతం మంచి ప్రదర్శన చేస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్‌తో అతడు ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అదేంటంటే..
Jayadev Unadkat: 12 ఏళ్ల తర్వాత టెస్టుల్లో రీఎంట్రీ.. వచ్చీ రాగానే సూపర్ రికార్డ్! - jaydev unadkat news
12 ఏళ్ల తర్వాత భారత జట్టులోకి అడుగుపెట్టిన సీనియర్ బౌలర్ ఉనద్కత్.. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అదేంటంటే..
2010లో జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసిన 31 ఏళ్ల ఉనద్కత్.. ఆ ఏడాది డిసెంబరు 16న దక్షిణాఫ్రికాపై జరిగిన టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే రెండో టెస్ట్ ఆడుతున్నాడు. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ మ్యాచ్‌లకు దూరమైన తొలి భారత క్రికెటర్ ఇతడే. ఇక, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక టెస్టులకు దూరమైన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. మొత్తంగా ఉనద్కత్ తన కెరీర్‌లో మొత్తంగా 118 టెస్టు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతడి కంటే ముందు ఇంగ్లాండ్ క్రికెటర్ గెరిత్ బ్యాటీ టెస్టు క్రికెట్‌లో 142 మ్యాచ్‌లు మిస్సయ్యాడు. అయితే భారత్ తరఫున ఉనద్కత్ ఏడు వన్డేలు, 10 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 10 మ్యాచుల్లో 19 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనతో ఈ లెఫ్టార్మ్ పేసర్ జట్టులోకి తిరిగి వచ్చాడు.
ప్రస్తుతానికి రెండు వికెట్లు.. ఇకపోతే ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు నజ్ముల్ హొస్సేన్, జాకిర్ హసన్ ఇన్నింగ్స్‌ను నిలకడగా మొదలుపెట్టారు. అయితే 15వ ఓవర్‌లో ఉనద్కత్ వేసిన ఐదో బంతిని జాకిర్(15) షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. కెప్టెన్ రాహుల్ క్యాచ్ పట్టాడు. దీంతో బంగ్లా తొలి వికెట్ కోల్పోయింది. టెస్టుల్లో ఉనద్కత్‌కు ఇదే తొలి వికెట్ కావడం విశేషం. ఆ తర్వాత రహీమ్ వికెట్‌ను పడగొట్టాడు. అలా ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో ఇప్పటివరకు రెండు వికెట్లు తీశాడు.