తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ సెంచరీపై స్పందించిన రషీద్​ ఖాన్​.. ఏమన్నాడంటే - కోహ్లీను అభినందించిన రషీద్ ఖాన్

Rashid Khan On Virat Kohli : ఆసియా కప్​లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్​లో అఫ్గానిస్థాన్.. భారత్​ చేతిలో ఓటమిపాలైంది. దీనిపై ఆ దేశ స్పిన్నర్​​ రషీద్ ఖాన్‌ స్పందించాడు. మూడేళ్ల తర్వాత సెంచరీ చేసిన విరాట్​ కోహ్లీకి ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు.

virat kohli rashid khan
virat kohli rashid khan

By

Published : Sep 9, 2022, 8:45 PM IST

Updated : Sep 9, 2022, 8:59 PM IST

Rashid Khan On Virat Kohli : రషీద్ ఖాన్‌.. టీమ్‌ఇండియా క్రికెట్ అభిమానులకు సుపరిచితుడు. భారత టీ20 లీగ్‌లో హైదరాబాద్ తరఫున చాలా మ్యాచ్‌లు ఆడాడు. గత సీజన్‌లో గుజరాత్‌ ఫ్రాంచైజీకి వెళ్లిపోయాడు. తాజాగా ఆసియా కప్‌లో భారత్‌-అఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌ జరిగింది. టీమ్‌ఇండియా ఓపెనర్‌ విరాట్ కోహ్లీ (122) అంతర్జాతీయ టీ20ల్లో మొదటి శతకం నమోదు చేశాడు. తమపైనే సెంచరీ చేసిన బ్యాటర్‌కు ప్రత్యేకంగా అభినందనలు చెప్పడం అరుదు. అయితే రషీద్‌ ఖాన్‌ మైదానంలో ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడో.. వెలుపలా అలానే ఉంటాడు. ఆసియా కప్‌లో తమ జట్టు ప్రయాణం ముగిశాక రషీద్ ఖాన్‌ తన సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు.

"ఆసియా కప్‌లో నా దేశం తరఫున ఆడటం ఎప్పటికీ గర్వకారణమే. ప్రేమ, మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు. అలానే ప్రత్యేకంగా విరాట్ కోహ్లీకి అభినందనలు. అంతర్జాతీయ టీ20ల్లో తొలి సెంచరీ చేయడం అద్భుతం. ఆసియా కప్‌ 2022 ఫైనల్‌కు వెళ్లిన శ్రీలంక, పాకిస్థాన్‌ జట్లకు ఆల్‌ ది బెస్ట్" అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. ఆసియా కప్‌ సూపర్‌-4లో శ్రీలంక, పాకిస్థాన్ జట్ల మీద అఫ్గానిస్థాన్‌ తృటిలో ఓటమిపాలైంది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచుల్లో ఆఖరి ఓవర్‌లో బోల్తా పడి ఫైనల్‌ అవకాశాలను చేజార్చుకుంది.

Last Updated : Sep 9, 2022, 8:59 PM IST

ABOUT THE AUTHOR

...view details