తెలంగాణ

telangana

వరల్డ్​ కప్​లో మళ్లీ వరుణుడి ఆట.. ఐర్లాండ్​- అఫ్గాన్​ మ్యాచ్ రద్దు

By

Published : Oct 28, 2022, 1:39 PM IST

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న టీ20 ప్రపంచకప్‌ టోర్నమెంట్‌కు వరుణుడు అడ్డంకిగా మారాడు. సూపర్ -12 పోరులో భాగంగా అఫ్గానిస్థాన్‌, ఐర్లాండ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది.

T20 World Cup
T20 World Cup

T20 World Cup: అఫ్గానిస్థాన్‌ క్రికెట్ జట్టుకు మరో ఎదురు దెబ్బ. టీ20 ప్రపంచకప్‌ సూపర్‌ -12 పోటీల్లో వరుసగా ఆ టీమ్‌ ఆడాల్సిన రెండో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడం విశేషం. మెల్‌బోర్న్‌ వేదికగా అఫ్గానిస్థాన్‌, ఐర్లాండ్‌ మ్యాచ్‌ను వర్షం కారణంగా రద్దు చేసినట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ దక్కింది. అంతకుముందు న్యూజిలాండ్‌-అఫ్గాన్‌ మధ్య మెల్‌బోర్న్‌లో జరగాల్సిన మ్యాచ్‌ ఇలానే రద్దు అయిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం గ్రూప్‌ -1లో అఫ్గానిస్థాన్‌ మూడు మ్యాచుల్లో రెండు పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇందులో ఒక ఓటమి, రెండు మ్యాచ్‌లు రద్దు ఉన్నాయి. ఇక ఐర్లాండ్‌ ఒక విజయం, ఒక ఓటమి, ఒక రద్దుతో మూడు పాయింట్లు సాధించి రెండో స్థానంలో కొనసాగుతోంది. అఫ్గానిస్థాన్‌కు శ్రీలంక, ఆస్ట్రేలియా వంటి గట్టి జట్లతో మ్యాచ్‌లు మిగిలి ఉండగా.. ఐర్లాండ్‌ కూడా ఆసీస్, న్యూజిలాండ్‌ టీమ్‌లతో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇదే గ్రూప్‌లో మరికాసేపట్లో నిర్వహించాల్సిన ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వరుణ గండం పొంచి ఉంది. కీలకమైన పోరుకు మెల్‌బోర్న్‌ స్టేడియమే వేదిక.

ABOUT THE AUTHOR

...view details