తెలంగాణ

telangana

ETV Bharat / sports

afghanistan women cricket: 'అఫ్గాన్ మహిళలు క్రికెట్ ఆడతారు!'

తమ దేశ మహిళలు క్రీడల్లో పాల్గొనాల్సిన అవసరం లేదని తాలిబన్లు ప్రకటించిన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసింది ఆ దేశ క్రికెట్ బోర్డు. మహిళలు క్రికెట్ ఆడేందుకు (afghanistan women cricket) ఇంకా అవకాశం ఉందని బోర్డు ఛైర్మన్ అజీజుల్లా ఫజ్లీ తెలిపారు.

afghanistan women cricket
అఫ్గానిస్థాన్

By

Published : Sep 11, 2021, 3:53 PM IST

మహిళలు క్రికెట్​ ఆడేందుకు (afghanistan women cricket) ఇప్పటికీ అవకాశం ఉందని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ అజీజుల్లా ఫజ్లీ అన్నారు. ఈ ప్రక్రియ ఎలా జరగబోతుందో త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు. తమ దేశం తరఫున మహిళలు క్రికెట్ ఆడాల్సిన పనిలేదని తాలిబన్ నేత అహ్మదుల్లా వసీక్​ ప్రకటించిన కొద్దిరోజులకే ఫజ్లీ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

"మహిళలు క్రికెట్ ఆడేందుకు ఇంకా అవకాశం ఉంది. దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్తామో త్వరలోనే స్పష్టమైన వివరాలు వెల్లడిస్తాం. ఈ ప్రక్రియపై ఓ శుభవార్త బయటకు రానుంది."

- అజీజుల్లా ఫజ్లీ, అఫ్గాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్

మహిళలు క్రికెట్ ఆడేందుకు తాలిబన్లు విముఖత చూపితే పురుషుల జట్టుతో నవంబర్​లో జరగాల్సిన టెస్టు మ్యాచ్ రద్దు చేస్తామని ఇదివరకే ఆస్ట్రేలియా హెచ్చరించింది. ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ కూడా టీ20 ప్రపంచకప్​ నుంచి అఫ్గాన్​ను తప్పించాలని పేర్కొన్నాడు. అయితే తాలిబన్​ల ప్రకటన ఆధారంగా పురుషుల జట్టును శిక్షించవద్దని ఆస్ట్రేలియాను కోరింది అఫ్గాన్ క్రికెట్ బోర్డు.

ఇదీ చూడండి:T20 Worldcup: 'ప్రపంచకప్​లో అఫ్గాన్ ఆడటం కుదరదు'

ABOUT THE AUTHOR

...view details