తెలంగాణ

telangana

ETV Bharat / sports

Afg Vs Ban ODI World Cup 2023 : బంగ్లా శుభారంభం.. తొలి మ్యాచ్​లో 6 వికెట్ల తేడాతో గెలుపు.. అఫ్గాన్ చెత్త రికార్డు - ప్రపంచకప్ లైవ్ స్కోర్

Afg Vs Ban ODI World Cup 2023 : ప్రపంచకప్​లో బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. అఫ్గాన్​తో జరిగిన మ్యాచ్​లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ ఓటమితో అఫ్గాన్ జట్టు.. ఓ చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది.

World Cup 2023 Bangladesh Afghanistan match
World Cup 2023 Bangladesh Afghanistan match

By PTI

Published : Oct 7, 2023, 5:09 PM IST

Afg Vs Ban ODI World Cup 2023 :2023 ప్రపంచకప్​లో భాగంగా అఫ్గానిస్థాన్​తోజరిగిన మ్యాచ్​లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆల్​రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న బంగ్లా.. ప్రత్యర్థిని 156 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం లక్ష్యాన్ని 34.4 ఓవర్లలోనే ఛేదించింది. మెహిదీ హసన్ మిరాజ్ బ్యాటింగ్, బౌలింగ్​లో సత్తా చాటాడు. బౌలింగ్​లో మూడు వికెట్లు తీసిన అతడు.. బ్యాటింగ్​లో అర్థశతకంతో రాణించాడు.

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన అఫ్గానిస్థాన్.. ఆరంభంలో నిలకడగా ఆడింది. ఓపెనర్లు గుర్బాజ్ ఖాన్, ఇబ్రహీం జద్రాన్​లు తొలి వికెట్​కు 47 పరుగులు జోడించారు. ఇరువురు సాధికారికంగా బ్యాటింగ్ చేశారు. స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. రెహ్మత్ షా(18), కెప్టెన్ షాహిదీ(18)లు భారీ ఇన్నింగ్స్ నిర్మించడంలో విఫలమయ్యారు. 15.1 ఓవర్ల సమయానికి రెండు వికెట్లు నష్టపోయి 83 పరుగులు సాధించిన అఫ్గాన్.. తర్వాత పూర్తిగా చతికిలపడిపోయింది. క్రమంగా వికెట్లు కోల్పోయింది. అజ్మతుల్లా(22) రాణించాడు. మిగిలిన ప్లేయర్లంతా సింగిల్ డిజిట్​కే పరిమితమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకిబ్ అల్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్​లు తలో మూడు వికెట్లు పడగొట్టారు. షొరీఫుల్ ఇస్లాం రెండు, తస్కిన్ అహ్మద్ ఒక వికెట్ పడగొట్టారు.

వికెట్ తీసిన ఆనందంలో బంగ్లా జట్టు

World Cup 2023 Youngest Player : నూర్ అహ్మద్ టు విక్రమ్​జీత్.. మెగాటోర్నీలో యంగ్ ప్లేయర్స్​ వీరే

ఆరంభంలో తడబడి..
అటు ఛేజింగ్​లో బంగ్లాకు ఆశించిన ఆరంభం దక్కలేదు. బంగ్లా ఓపెనర్ తంజిద్ హసన్ 5 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రనౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ లిట్టన్​ దాస్ 13 రన్స్​కు పెవీలియన్ చేరాడు. దీంతో 27 పరుగులకే బంగ్లా రెండు వికెట్లు కోల్పోయింది. అయితే, ఆ తర్వాత వ్చచిన మెహిదీ హసన్ మిరాజ్, నజ్ముల్ హొస్సైన్ శాంటోలు ఇన్నింగ్స్​ను చక్కదిద్దారు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ.. అప్పుడప్పుడు బౌండరీలు కొడుతూ స్కోర్ బోర్డును నడిపించారు. మెహిదీ 57 పరుగులు చేసి నవీన్ ఉల్ హక్ బౌలింగ్​లో క్యాచ్ ఔట్ అయి వెనుదిరగ్గా.. సారథి షకిబ్ 14 పరుగులకే అజ్మతుల్లా బౌలింగ్​లో పెవిలియన్ చేరాడు. చివరి వరకు క్రీజులో నిలబడిన నజ్ముల్ 59 పరుగులు చేసి బంగ్లాను విజయతీరాలకు చేర్చాడు. అఫ్గాన్ బౌలర్లలో ఫజల్​హక్ ఫారూఖీ, నవీన్ ఉల్ హక్, అజ్మతుల్లా తలో వికెట్ తీశారు. స్టార్ బౌలర్ రషీద్ ఖాన్.. 9 ఓవర్లు వేసి వికెట్ లేకుండా 48 పరుగులు ఇచ్చుకున్నాడు.

రషీద్ ఖాన్

అఫ్గాన్ చెత్త రికార్డు
తాజా మ్యాచ్​తో ప్రపంచకప్​లో అఫ్గానిస్థాన్ వరుసగా 13 మ్యాచ్​లలో ఓడినట్లైంది. 2015 నుంచి 2023 మధ్య ఆడిన 13 మ్యాచ్​లలో అఫ్గాన్ ఓటమి చవి చూసింది. జింబాబ్వే (1983 నుంచి 1992 మధ్య) 18 మ్యాచ్​లలో ఓడిపోయి.. అత్యధిక ఓటముల జాబితాలో తొలి స్థానంలో ఉంది. స్కాట్లాండ్ (1999 నుంచి 2015 మధ్య) 14 వరుస మ్యాచులలో ఓడింది.

అఫ్గాన్ జట్టు

Asia Cup 2023 Group Stage Best Knocks : గ్రూప్​ స్టేజ్​లో అత్యుత్తమ ప్రదర్శనలు.. బాబర్, హార్దిక్ కంటే అతడి ఇన్నింగ్సే బెస్ట్​!

ABOUT THE AUTHOR

...view details