బిగ్ బాష్ లీగ్‌లో మరో వివాదం తెరపైకి వచ్చింది. ఇటీవల ఓ క్యాచ్‌తో వివాదాల్లో నిలిచిన ఈ లీగ్.. ఇప్పుడు ఆడమ్ జంపా మన్కడింగ్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. మంగళవారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ వర్సెస్ మెల్‌బోర్న్ రెనెగేడ్స్ మధ్య మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. స్టార్స్ జట్టు తమ ఇన్నింగ్స్‌లో చివరి ఓవర్‌ను ఆడుతుండగా.. ఆడమ్ జంపా బౌలింగ్ చేశాడు. అతడు ఐదో బంతిని బౌలింగ్ చేస్తున్నప్పుడు నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ టామ్ రోజర్స్ .. జంపా బంతి విసరక ముందే క్రీజు దాటేశాడు. దాంతో వెంటనే వెనక్కి తిరిగిన జంపా.. వికెట్లను కూల్చి అంపైర్‌కు అప్పీల్ చేశాడు. కానీ అంపైర్ ఔట్ ప్రకటించలేదు.
టెక్నికల్‌గా నాటౌట్.. అయితే అంపైర్ నిర్ణయం తీసుకోవడం కోసం టీవీ అంపైర్ సాయం కోరాడు. రిప్లే పరిశీలించిన థర్డ్ అంపైర్ నాటౌట్ అని ప్రకటించడంతో.. జంపాతో సహా అంతా ఆశ్చర్యపోయారు. దీంతో రోజర్స్ ఊపిరి పీల్చుకున్నాడు.