T20 worldcup trophy: ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్-నవంబర్ మధ్య జరగనున్న టీ20 ప్రపంచకప్ ట్రోఫీ ప్రపంచమంతా చుట్టేస్తోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలోని ప్రకృతి సౌందర్య ప్రాంతం గ్రేట్ బ్యారియర్ రీఫ్‌కు చేరుకుంది. దీంతో ట్రోఫీని ఆ జట్టు స్పిన్నర్ ఆడమ్ జంపా, స్పోర్ట్స్ ప్రెజెంటర్ ఎరిన్ హోలాండ్, పారాఒలింపిక్ స్విమ్మర్ గ్రాంట్ ప్యాటర్‌సన్ గ్రేట్ బ్యారియర్ రీఫ్ వాటర్‌లోకి ప్రత్యేకంగా తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రపంచకప్ ట్రోఫీ 12 దేశాలే కాకుండా ఆస్ట్రేలియాలోని ఎనిమిది రాష్ట్రాల్లోని 21 ప్రాంతాలను చుట్టేసి వస్తుంది.
టీ20 ప్రపంచకప్ ట్రోఫీ స్పెషల్ టూర్.. ఫొటోస్ అదిరాయిగా - టీ20 ప్రపంచకప్ ట్రోఫీ అడం జంపా
T20 worldcup trophy: టీ20 ప్రపంచకప్ ట్రోఫీ ప్రపంచమంతా చుట్టేస్తోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలోని ప్రకృతి సౌందర్య ప్రాంతం గ్రేట్ బ్యారియర్ రీఫ్‌కు చేరుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
"ప్రకృతి సౌందర్యం కలిగిన ఇటువంటి ప్రాంతంలో ఉండటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా. అదేవిధంగా ప్రపంచకప్‌ను గ్రేట్ బ్యారియర్ రీఫ్‌లోకి తీసుకెళ్లడం ఎంతో గర్వంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆస్ట్రేలియాకి వచ్చి టోర్నీని ఉత్సాహపరచాలి. అత్యుత్తమ జట్లతో క్రికెట్ అభిమానులకు ఎంటర్‌టైన్‌మెంట్ తప్పకుండా అందిస్తుంది" అని జంపా పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ కూడా ట్విటర్ వేదికగా స్పందించింది." ట్రోఫీని గ్రేట్ బ్యారియర్ రీఫ్ ప్రాంతానికి తీసుకెళ్లడం అద్భుతంగా అనిపించింది" అని ట్వీట్ చేసింది.
ఇదీ చూడండి: ICC Rankings: దూసుకెళ్లిన హార్దిక్, పంత్.. కోహ్లీ, బుమ్రా డౌన్