తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాక్​ బౌలర్​తో లవ్​లో ఊర్వశి రౌతేలా.. పంత్​ను రెచ్చగొట్టడానికేనా? - పాక్​ బౌలర్​తో లవ్​లో నటి ఊర్వశిరౌతేలా

Urvasi rautela Pak bowler in love టీమ్​ఇండియా క్రికెటర్​ పంత్​ బాలీవుడ్ బ్యూటీ ఊర్వశిరౌతేలా మధ్య కోల్డ్​ వార్​ సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడీ అమ్మడు.. పాక్​ యంగ్​ బౌలర్​తో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఆ సంగతులు..

urvasi rautela
పాక్​ బౌలర్​తో ఊర్వశి రౌతేలా

By

Published : Sep 7, 2022, 3:24 PM IST

Updated : Sep 7, 2022, 5:23 PM IST

Urvasi rautela Pak bowler in love: కొంతకాలం నుంచి టీమ్​ఇండియా క్రికెటర్​ పంత్​తో మాటల యుద్ధానికి దిగిన బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా.. ప్రతిరోజు వార్తల్లో నిలుస్తూ ఉంది. సోషల్​మీడియాలో విపరీతంగా ట్రోలింగ్​కు గురౌతోంది. రిలేషన్​షిప్​లో ఉన్న వీరిద్దరూ విడిపోయారని అందుకే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారని అంతా అనుకుంటున్నారు. అయితే ఇటీవలే ఈ ముద్దుగుమ్మ ఆసియా కప్​లో భాగంగా పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లకు హాజరైంది. పంత్​ను కవ్వించడానికే అక్కడికి వచ్చిందని అంతా అనుకున్నారు.

అయితే ఇప్పుడీ కథలో ఓ కొత్త ట్విస్ట్​ బయటకు వచ్చింది. రౌతేలా పాక్ యంగ్ బౌలర్ నసీష్​ షాతో లవల్​ పడినట్లు తెలిసింది. అందుకే మ్యాచ్​లు చూడటానికి వచ్చిందట. వీరిద్దరి విజువల్స్ కలిపి ఓ నెటిజన్ వీడియో రీల్​ క్రియేట్ చేయగా, దాన్ని ఈ అమ్మడు తన ఇన్​స్టా స్టోరీలో పోస్ట్ చేసి రూమర్స్​కు మరింత బలాన్ని చేకూర్చింది. పంత్​పై జెలసీతోనే ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఇది చూసిన నెటిజన్స్ ఆమెను మాత్రం ఫుల్​గా ఆటాడేసుకుంటున్నారు. మీమ్స్​తో చెలరేగిపోతున్నారు.

ఇదీ చూడండి: ఎవరీ బ్యూటీ.. అర్షదీప్​ బౌలింగ్​కు ఫిదా.. పెళ్లి చేసుకోవాలంటూ..

Last Updated : Sep 7, 2022, 5:23 PM IST

ABOUT THE AUTHOR

...view details