'కాంతార' మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రిషభ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కన్నడతో పాటు పలు భాషల్లో విడుదలై ఘన విజయం సాధించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి ఔరా అనిపించింది. అయితే తాజాగా బెంగళూరులో బెంగళూరులో నటుడు రిషభ్‌ను దక్షిణాఫ్రికా స్టార్ క్రికెడర్ ఏబీ డెవిలియర్స్ కలిశారు. ఆ వీడియోను రిషభ్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.
"నేను అసలైన 360ని కలిశాను. సూపర్ హీరో మళ్లీ తిరిగి వచ్చాడు" అని రిషభ్ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీరిద్దరి సమావేశంతో అభిమానులను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 'టూ స్టార్స్' 'టూ లెజెండ్స్' అంటూ అభిమానులు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఇటీవలే ఈ చిత్రాన్ని వీక్షించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ప్రశంసించారు. "ఈ చిత్రం తుళువనాడు, కరావళి వంటి గొప్ప సంప్రదాయాలను తెలుపుతుంది" అని ట్విట్టర్ ద్వారా ఆమె వ్యాఖ్యనించారు.