తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రికెట్​లో విచిత్రమైన నో బాల్ - వీడియో వైరల్ - మీరు చూశారా? - క్రికెట్ హిస్టరీలో చెత్త నో బాల్

Abu Dhabi T10 League No Ball : అబుదాబి టీ10 లీగ్​లో విచిత్రమైన నో బాల్ సంధించాడు పేసర్ అభిమన్యూ మిథున్. మరి ఈ నో బాల్ వీడియో మీరూ చూసేయండి.

Abu Dhabi T10 League No Ball
Abu Dhabi T10 League No Ball

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2023, 5:04 PM IST

Updated : Dec 3, 2023, 8:18 PM IST

Abu Dhabi T10 League No Ball :అబుదాబి టీ10 లీగ్​ మ్యాచ్​లో వింత నో బాల్ సంధించాడు బౌలర్ అభిమన్యూ మిథున్. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో లీగ్ మ్యాచ్​లో భాగంగా శనివారం చెన్నై బ్రేవ్స్ - నార్తర్న్ వారియర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్​లో నార్తర్న్ పేసర్ ఆభిమన్యు.. 5వ ఓవర్ బౌలింగ్ చేశాడు.

ఈ ఓవర్​లో మూడో బంతిని సంధించే క్రమంలో.. అతడి అడుగు లైన్​ దాటి ముందుకు పడింది. దీంతో ఈ బంతిని ఫీల్డ్ అంపైర్ నో బాల్​గా ప్రకటించాడు. అయితే రిప్లైలో చూడగా.. అతడి ఫుట్​కు, లైన్​కు ఉన్న దూరం చూసి అందరూ షాక్​కు గురయ్యారు. అతడి అడుగు దాదాపు రెండు ఫీట్ల దూరం పడింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. క్రికెట్​లో అత్యంత చెత్త నో బాల్ ఇదేనేమో అని కామెంట్లు చేస్తున్నారు. మరి మీరూ ఆ నో బాల్ వీడియో చూసేయండి.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్తర్న్ వారియర్స్.. నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. నార్తర్న్​ జట్టులో హజ్రతుల్లా బజాయ్ (54 పరుగులు) హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై బ్రేవ్స్​.. 9.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బ్రేవ్స్ జట్టులో సికిందర్ రజా (27 పరుగులు, 10 బంతుల్లో)కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఈ మ్యాచ్​లో అభిమన్యూ మిథున్ రెండు ఓవర్లు బౌలింగ్ చేశాడు. అతడు రెండు ఓవర్లలో 5.50 ఎకనమీతో 11 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

Abu Dhabi T10 2023 Final :ఎనిమిది జట్లు తలపడుతున్న ఈ లీగ్​లో దిల్లీ బుల్స్ నాలుగింట్లో, మూడు విజయాలతో టాప్​లో కొనసాగుతోంది. ఇక డిసెంబర్ 9న జాయిద్ క్రికెట్ స్టేడియం అబుదాబి వేదికగా ఫైనల్ జరగనుంది.

పాకిస్థాన్​ టీ20 లీగ్​లో వింత ఘటన- ఇలా జరగడం చాలా అరుదు!

గ్రౌండ్​లో కొడుకు ఆట - మెట్లపై కూర్చుని చూసిన ద్రవిడ్​ - సింప్లిసిటీ అంటే ఇదే కదా!

Last Updated : Dec 3, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

...view details