Moeen Ali smashes Fastest Fifty: ఇంగ్లాండ్ క్రికెటర్ మొయిన్ అలీ అబుదాబి టీ10 లీగ్(Abu Dhabi T10 League)లో దుమ్మురేపాడు. ఈ లీగ్‌లో నార్తర్న్ వారియర్స్‌కు ఆడుతున్న ఇతడు టీమ్ అబుదాబితో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 16 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకుని.. ఈ టోర్నీలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 23 బంతుల్లోనే 77 పరుగులు చేసి జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు అలీ. ఇతడికి మద్దతుగా నిలిచిన మరో ఓపెనర్ కెన్నెర్ లూయిస్ 32 బంతుల్లో 65 పరుగులతో మెరిశాడు. దీంతో వీరిద్దరూ ఓపెనింగ్ వికెట్‌కు 146 పరుగులు జోడించారు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో టీమ్ అబుదాబిపై నార్తర్న్ వారియర్స్ ఘనవిజయం సాధించింది.
Abu Dhabi T10 League: మొయిన్ ఊచకోత.. లీగ్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ - మొయిన్ అలీ వేగవంతమైన హాఫ్ సెంచరీ
Abu Dhabi T10 League: అబుదాది టీ20 లీగ్‌లో అత్యంత వేగంగా అర్ధశతకం చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు ఇంగ్లాండ్ బ్యాటర్ మొయిన్ అలీ. నార్తర్న్ వారియర్స్‌కు ఆడుతున్న ఇతడు టీమ్ అబుదాబితో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.
Moeen Ali
ఈ మ్యాచ్‌లో రికార్డులు ఇవే
- ఈ టోర్నీలో అత్యధిక వేగంగా అర్ధసెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు మొయిన్ అలీ. (16 బంతుల్లో)
- లీగ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (77) సాధించిన క్రికెటర్‌గానూ ఘనత వహించాడు అలీ.
- అలాగే కెన్నెర్తో కలిసి అత్యధిక భాగస్వామ్య పరుగుల రికార్డు నెలకొల్పాడీ ఇంగ్లీష్ క్రికెటర్
- వీరిద్దరి విజృంభణతో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు బాదిన జట్టుగా ఘనత సాధించింది నార్తర్న్ వారియర్స్.