మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎమ్‌సీసీ) లైఫ్ మెంబర్షిప్ అవార్డు తనకు లభించడం సంపూర్ణ గౌరవంగా భావిస్తున్నట్లు టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చెప్పాడు. హర్భజన్, టీమ్ఇండియా మాజీ బౌలర్ శ్రీనాథ్‌తో సహా 16 మందికి ఈ గౌరవం దక్కింది.
హర్భజన్, శ్రీనాథ్ అంతర్జాతీయంగా టీమ్ఇండియా తరపున ఆడారు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన వారిలో హర్భజన్ మూడో స్థానంలో ఉన్నాడు. 103 టెస్టుల్లో 417 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసినవారిలో శ్రీనాథ్ రెండో స్థానంలో ఉన్నాడు.