Abid Ali heart Attack: పాకిస్థాన్ టెస్టు క్రికెటర్ అబిద్ అలీకి మైదానంలో బ్యాటింగ్ చేస్తుండగానే గుండెపోటు వచ్చింది. తీవ్రమైన ఛాతి నొప్పితో బాధపడుతుండగా.. వెంటనే అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు.
క్వైద్-ఎ-అజాం ట్రోఫీలో భాగంగా మంగళవారం సెంట్రల్ పంజాబ్- ఖైబర్ (Khyber Pakhtunkhwa) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలోనే పంజాబ్ తరపున బ్యాటింగ్కు దిగిన అబిద్ అలీకి మ్యాచ్ మధ్యలోనే ఛాతి నొప్పి వచ్చింది. ఈ విషయాన్ని టీమ్ యాజమాన్యానికి చెప్పగా.. వెంటనే స్పందించిన టీమ్ అతన్ని ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు అలీ. అతని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది.