మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ తిరిగి క్రికెట్లోకి పునరాగమనం చేస్తాడంటూ వస్తున్న ఊహాగానాలపై దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు స్పష్టతనిచ్చింది. రిటైర్మెంట్ విషయంలో అతడి నిర్ణయం మారదని తేల్చి చెప్పింది. వీడ్కోలు అంశంపై తమతో కూడా మాట్లాడాడని వెల్లడించింది. ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు ఏబీ.. తిరిగి జట్టులోకి వస్తాడని కొద్దిరోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. బోర్డు ఇలా పైవ్యాఖ్యలు చేసింది.
వెస్టిండీస్‌తో రెండు టెస్టులు, 5 టీ20ల కోసం జట్టును ప్రకటించిన అనంతరం దక్షిణాఫ్రికా బోర్డు ఈ ప్రకటన చేసింది. మే 2018లో డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించాడు. ప్రోటీస్ జట్టు తరఫున 114 టెస్టులతో పాటు 228 వన్డేలు, 78 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు.