ఏడాది కాలంగా పరుగులు చేయడానికి ఇబ్బందిపడ్డ టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్‌తో రెండో టీ20తో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ ముగిశాక.. తొలి టీ20లో సున్నాకే వెనుదిరిగిన తర్వాత ఏబీ డివిలియర్స్ నుంచి సూచనలు పొందానని, అవి ఎంతో ఉపయోగపడ్డాయని కోహ్లీ అప్పుడు తెలిపాడు. అయితే అప్పుడు తన సహచర ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీకి చెప్పిన సూచనలను తాజాగా డివిలియర్స్ బయటపెట్టాడు.
కోహ్లీకి ఆ సూచనలు చేశా: డివిలియర్స్ - కోహ్లీకి డివిలియర్స్ సూచనలు
ఏడాది కాలంగా పరుగులు చేయడానికి ఇబ్బందిపడిన టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీకి పలు సూచనలు చేశాడు ఏబీ డివిలియర్స్. తాజాగా వాటిపై స్పందించాడు.
"ఆ విషయాలను చెప్పడానికి ఆసక్తి లేదు. ఎందుకంటే అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. కోహ్లీకి అప్పుడు నాలుగు విషయాలు చెప్పా. ఆటేతర విషయాలతో పాటు టెక్నిక్ గురించి కూడా అప్పుడు మాట్లాడుకున్నాం. చాలా ప్రాథమిక అంశాలనే అతనికి వివరించా. అంతకంటే కొన్ని రోజుల ముందు నుంచే అతనికా విషయాలు చెప్పాలని అనుకున్నా. ఎందుకంటే దానికంటే ముందు కొన్ని నెలలుగా అతను బ్యాటింగ్‌లో ఇబ్బందిపడ్డాడు. క్రీజులో నిలబడలేకపోయాడు. దీంతో అతని నుంచి సందేశం వచ్చినపుడు నాకెలాంటి ఆశ్చర్యం కలగలేదు. అతనికి ప్రాథమిక అంశాలపై మరింత అవగాహన కావాలని నాకు తెలుసు. బంతిని సరిగా చూడడం, తలను నిటారుగా ఉంచడం, అనువైన ప్రదేశంలోకి బంతి వచ్చేలా చేయడం, చివరగా శారీరకంగా, వ్యక్తిత్వం పరంగా ఉత్తమంగా ఉండడం అనే నాలుగు విషయాలు తనకు చెప్పా" అని ఆర్సీబీ ట్విట్టర్‌లో పోస్టు చేసిన వీడియోలో ఏబీ పేర్కొన్నాడు.