ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల సారథి అరోన్ ఫించ్(Aaron finch) భార్య అమీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంతోషకరమైన వార్తను తెలియజేస్తూ ఇన్స్టాలో పాప ఫొటోను ఇన్స్టాలో పోస్ట్ చేశాడీ ఆసీస్ క్రికెటర్. పాపకు ఎస్తర్ కేట్ ఫించ్గా నామకరణం చేసినట్లు తెలిపాడు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించాడు.
"ఎస్తర్ కేట్ ఫించ్ కొత్త ప్రపంచానికి స్వాగతం. మా బుజ్జి యువరాణి నిన్న సాయంత్రం 4.58 గంటలకు 3.54కేజీల బరువుతో జన్మించింది. ఇద్దరి ఆరోగ్యం బాగానే ఉంది" అంటూ ఫించ్ వ్యాఖ్య రాసుకొచ్చాడు.