తెలంగాణ

telangana

ETV Bharat / sports

'రోహిత్-రాహుల్​పైనే ఆధారపడితే ఎలా?' - టీమ్​ఇండియాపై ఆకాశ్ చోప్రా కామెంట్స్

టీమ్​ఇండియా ఎక్కువగా టాపార్డర్​పై ఆధారపడటాన్ని తప్పుపట్టాడు మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా(aakash chopra Latest). టీ20 ప్రపంచకప్​లో భారత జట్టు ఆటతీరును ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు. టీ20ల్లో ప్రతి ఆటగాడు చేసే వ్యక్తిగత స్కోరే చాలా ముఖ్యమని తెలిపాడు.

akash chopra
ఆకాశ్ చోప్రా

By

Published : Nov 5, 2021, 12:53 PM IST

టీ20ల్లో టీమ్​ఇండియా.. పూర్తిస్థాయిలో టాపార్డర్​ బ్యాటర్లపైనే ఆధారపడుతోందని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా(Aakash Chopra Latest) అన్నాడు. ముఖ్యంగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్​లపై భారం వేస్తోందని తన యూట్యూబ్​ ఛానెల్​లో షేర్​ చేసిన ఓ వీడియోలో పేర్కొన్నాడు.

"పరిమిత ఓవర్లలో ఆటగాడు వ్యక్తిగతంగా చేసే స్కోరే చాలా కీలకం. కానీ, టీమ్​ఇండియా టాపార్డర్​పై ఎక్కువగా ఆధారపడుతోంది. రోహిత్, రాహుల్ బాగా ఆడితే భారీ లక్ష్యం నమోదు చేసి టీమ్​ గెలుస్తోంది. కోహ్లీ విషయంలోను ఇదే వర్తిస్తుంది."

-ఆకాశ్ చోప్రా, వ్యాఖ్యాత.

టీ20 ప్రపంచకప్ టోర్నీలో(T20 World Cup 2021) తొలి రెండు మ్యాచ్​ల్లో టాపార్డర్​ విఫలమైన కారణంగా భారత్ ఓటమి పాలైందని ఆకాశ్ తెలిపాడు. అఫ్గానిస్థాన్​తో(IND vs AFG T20) టాపార్డర్​ బ్యాటర్లు కళ్లుచెదిరే బ్యాటింగ్​ చేశారు కాబట్టి టీమ్​ఇండియా విజయం సాధించిందని పేర్కొన్నాడు. ఇలా టాప్​ ముగ్గురు లేదా ఐదుగురు ఆటగాళ్లే రాణించాలనే ధోరణి మారాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.

టీ20ల్లో ప్రతిసారి దాదాపు 200 పరుగుల లక్ష్యం పెట్టే సత్తా టీమ్​ఇండియాకు ఉందని అకాశ్​ అన్నాడు. కానీ, ఆ స్థాయిలో టీమ్​ఇండియా ప్రతిభ కనబరచడం లేదని తెలిపాడు. జట్టులో ఉన్న ప్రతి ఆటగాడు వ్యక్తిగతంగా ఎక్కువ స్కోరు నమోదు చేసే అలవాటు చేసుకోవాలని సూచించాడు.

ఇదీ చదవండి:

'టీమ్‌ఇండియాతో ఫైనల్స్‌ కోసం ఎదురుచూస్తున్నాం'

ABOUT THE AUTHOR

...view details