తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​ భారీ మూల్యం చెల్లించుకుంది: ఆకాశ్‌ చోప్రా - ఆకాశ్​ చోప్రా మాజీ టీమ్​ ఇండియా ప్లేయర్​

గాయం కారణంగా టీ20 ప్రపంచ కప్​కు దూరమయ్యాడు క్రికెటర్​ జస్ప్రీత్​ బుమ్రా. ఇలాంటి కీలక సమయంలో జట్టుకు దూరం కావడం టీమ్​ ఇండియాకు ఎదురుదెబ్బ అని క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

jasprit bumrah
akash chopra about bumrah

By

Published : Oct 5, 2022, 6:59 AM IST

Jasprit Bumrah injury : వెన్ను నొప్పి కారణంగా టీ20 ప్రపంచకప్‌నకు జస్ప్రీత్‌ బుమ్రా దూరం కావడం టీమ్‌ఇండియాకు పెద్ద ఎదురు దెబ్బ. మెగా టోర్నీలో బౌలింగ్‌ దళాన్ని నడిపిస్తాడని భావించిన బుమ్రా.. కీలక సమయంలో జట్టుకు దూరం కావడంపై భారత మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా ఇదే విషయంపై ట్విటర్‌లో స్పందించాడు. బుమ్రా గాయంపై మేనేజ్‌మెంట్‌ ప్రణాళికలు ఏంటో అర్థం కాలేదని పేర్కొన్నాడు. అలాగే ఆసియా కప్‌లో మాదిరిగా టీ20 ప్రపంచకప్‌లోనూ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఆసియా కప్‌లో కూడా బౌలింగ్‌ వైఫల్యంతో కీలక మ్యాచ్‌లను టీమ్‌ఇండియా చేజార్చుకొంది.

"గాయం కారణంగా బుమ్రా విండీస్‌తో సిరీస్‌.. ఆసియా కప్‌ నుంచి వైదొలిగాడు. బుమ్రాకు బదులు షమీ అయితేనే ఉత్తమ ఎంపిక అయ్యేది. కానీ భారత్‌ కేవలం ముగ్గురు పేసర్లతోనే ఆసియా కప్‌ టోర్నీకి వెళ్లింది. భారీ మూల్యం చెల్లించుకొంది. ఇప్పుడు కూడా ఇలానే చేస్తే మళ్లీ అదే పునరావృతం అయ్యే అవకాశం ఉంది" అని ఆకాశ్‌ చోప్రా ట్వీట్ చేశాడు. బుమ్రా వైదొలగిన అనంతరం దక్షిణాఫ్రికాతో మిగతా మ్యాచ్‌లకు సిరాజ్‌ను ఎంపిక చేయడం గమనార్హం. టీ20 మెగా టోర్నీ ప్రధాన జట్టులోకి మహమ్మద్‌ సిరాజ్‌ను తీసుకొంటే.. సిరాజ్‌ను స్టాండ్‌బై ఆటగాడిగా తీసుకొనే వెసులుబాటు ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details