టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇష్టమైన కారు లంబోర్గిని(Kohli Lamborghini) గల్లార్డో స్పైడర్! కానీ, ఇప్పుడీ కారును అమ్మకానికి పెట్టాడు. ఈ ఫారెన్ కారును 2015లో కోహ్లీ కొనుగోలు చేశాడు. మార్కెట్లో ప్రస్తుతం రూ.1.35 కోట్ల ధర పలుకుతుంది. 4 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత. అయితే ఈ కారును వాడిన కొన్నేళ్లకే విరాట్(Virat Kohli News) దీనిని విక్రయించేశాడు. ఇదే విషయాన్ని కేరళలోని కోచి రాయల్ డ్రైవ్ మార్కెటింగ్ మేనేజర్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఆ లగ్జరీ కారు ఇప్పటివరకు కేవలం 10 వేల కి.మీ. నడిచిందని ఆయన స్పష్టం చేశాడు.
"ఇది 2013 మోడల్ లంబోర్గిని. కోహ్లీ కొద్దికాలమే దీన్ని ఉపయోగించాడు. ఇది 10 వేల కి.మీ. మాత్రమే తిరిగింది. కోల్కతాకు చెందిన ప్రీమియం, లగ్జరీ ప్రీఓన్డ్ కార్ డీలర్ నుంచి మేం ఈ కారును కొనుగోలు చేశాం" అని రాయల్ డ్రైవ్ మార్కెటింగ్ మేనేజర్ వెల్లడించాడు.